corona update: కళ్లు ఎర్రబడ్డాయా? రూటు మార్చిన వైరస్. ఈ కొత్త లక్షణాలు ఉంటే చెక్ చేసుకోండి

corona update: కళ్లు ఎర్రబడ్డాయా? రూటు మార్చిన వైరస్. ఈ కొత్త లక్షణాలు ఉంటే చెక్ చేసుకోండి

ఏపీలో రూటు మార్చిన కొత్త రకం కరోనా

కళ్లు ఎర్ర బడుతున్నాయా? నీరు కారే పింక్‌ ఐస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయా? చెవుల్లో భారీగా శబ్ధం వినిపిస్తోందా? కొత్త రకం కరోనా రూటు మార్చిందా? కొత్త లక్షణాలు రావడంతో వైద్య నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు ఏపీపై కరోనా పంజా విసురుతోంది. కొత్తగా 4 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

  • Share this:
    రోజు రోజుకూ కరోనా వైరస్ భయపెడుతోంది. తొలి దశ కంటే సెకెండ్ వేవ్ ఇంకాస్త వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో.. కొత్త రకం లక్షణాలు కనిపిస్తుండడం కాస్త ఆందోళన పెంచుతోంది అంటున్నారు వైద్య నిపుణులు. తొలి దశలో కనిపించని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇలా రోజు రోజుకూ కరోన రూటు మార్చి మరీ విజృంభిస్తోంది.

    కేవలం ఏపీలోనే కాదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అవి కూడా తొలి దశ కొవిడ్‌ లక్షణాలకు చాలా భిన్నంగా ఉన్నట్టు కొందరు వైద్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కడుపు నొప్పి, తల తిరగడం, వాంతులు, జలుబు వంటి లక్షణాలను గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులకు కీళ్ల నొప్పులు, మైయాల్జియా, జీర్ణ సంబంధ సమస్యలు, ఆకలి కోల్పోవడం లాంటి లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయంట.

    చాలా మందిలో కళ్లు ఎర్రబడుతున్నట్టు గుర్తించారు. అలాగే నీరు కారే పింక్‌ ఐస్‌ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. అలాగే కొంత మంది చెవుల్లో భారీగా శబ్దం వినిపిస్తున్న లక్షణాలు ఉన్నాయి అంటున్నారు. మరికొందరిలో అయితే డయేరియాలో కనిపించే వాంతులు, విరేచనాలు బయటపడుతున్నట్టు గుర్తించారు. ఊపిరితిత్తుల మీద దాడి చేసే కొవిడ్‌ వైరస్‌ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తోంది అంటున్నారు. విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కొవిడ్‌ లక్షణాలుగానే అనుమానించాలంటున్నారు వైద్యులు. చాలా మందిలో నీరసం, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ సమయాల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

    ఓవైపు కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఏపీ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది అనే చెప్పాలి. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య ప్రస్తుతం ఆందోళన పెంచుతోంది. మంగళవారం విడుదల చేసిన వైద్య శాఖ హెల్త్ బులిన్ లో.. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 582 శాంపిల్స్ పరిశీలించగా.. 4 వేల 228 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షల 32 వేల 892 కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7,321కి చేరింది.

    గత 24 గంటల్లో 1,483 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 8 లక్షల 99 వేల 721 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 వేల 850 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 842, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.

    జిల్లాల వారిగా గత 24 గంటల్లో నమోదైన కేసులు ఇవే

    అనంతపురం 128

    చిత్తూరు 842

    తూర్పు గోదావరి 538

    గుంటూరు 622

    కడప 334

    కృష్ణా 261

    కర్నూలు 88

    నెల్లూరు 268

    ప్రకాశం 284

    శ్రీకాకుళం 271

    విశాఖపట్నం 414

    విజయనగరం 130

    పశ్చిమ గోదావరి 48
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు