హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Danger Bells: బాబోయ్ బడిలో కరోనా..? నిబంధనలను గాలికి వదిలేస్తున్నారా..?

Corona Danger Bells: బాబోయ్ బడిలో కరోనా..? నిబంధనలను గాలికి వదిలేస్తున్నారా..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Corona Tension In Schools: ప్రభుత్వ పఠశాలల్లో కరోనా కేసులు పెరగడానికి కారణం ఏంటి..? ప్రభుత్వ గైడ్ లైన్స్ అమలు అవుతున్నాయా..? వాటిని అమలు చేయాల్సిన బాధత్య ఎవరిది..? కొందరి నిర్లక్ష్యం అందిరికీ చేటు చేస్తుందా..?

  అన్నా రఘు, అమరావతి ప్రతినిది న్యూస్ 18.

  Corona Virus: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గుడి గంటలు ఎప్పుడో మోగగా.. ఇటీవల బడి గంటలు కూడా మోగాయి. కరోనా కారణంగా (Corona Effect) గతేడాది మార్చి 15న మూతపడ్డ బడులు  సెప్టెంబరు 16 (Septmber 15th) నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఓ విద్యా సంవత్సరం లేకుండా పోయింది. తప్పని సరి పరిస్థితుల్లో పరీక్షలు లేకుండా అందరి విద్యార్థులను తరువాత తరగతులకు అప్ గ్రేడ్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితిలు చూస్తుంటే.. విద్యార్థులను స్కూళ్లకు పంపండం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న తలెత్తుతోంది. అలా అని స్కూళ్లూ మూతపడితే రెండో విద్యా సంవత్సరం కూడా బోధన లేకుండానే ముగిసిపోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఎవరూ పాఠశాలలు తెరవడాన్ని (schools Reopen) తప్పు పట్టడం లేదు.. కానీ దాదాపు చాలా వరకు స్కూళ్లు.. ప్రభుత్వం సూచించిన  నిబంధనలు (Government Guildlines) తుంగలో తొక్కేస్తున్నాయి. అందుకు నిదర్శనం ఇటీవల స్కూల్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు. (Corona Cases in Schools) ఇప్పటికే ప్రకాశం, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాలోని బడుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకడంతో వాటిని 15 రోజులపాటు మూసి వేయాల్సి వచ్చింది. పాఠశాలలు నడుపుతూనే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకే ప్రమాదం 98 శాతం దాకా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా బడుల్లో పాఠశాల్లో ఎక్కడా  కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

  పాఠశాలల ప్రారంభానికి ముందే ప్రభుత్వం కరోనా నియంత్రణకు నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించేందుకు ప్రభుత్వ బడులకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. విద్యార్థులకు జ్వర పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి పాఠశాలకు థర్మల్  స్క్రీన్ లర్లను సరఫరా చేయాల్సి ఉంది. అయితే చాలా పాఠశాలలకు థర్మల్ స్కీనర్ లు సరఫరా చేసినా, వాటిని ఉపయోగిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక ప్రతి విద్యార్థి చేతులు శుభ్రపరచుకునేందుకు శానిటైజర్ సరఫరా చేయాల్సి ఉంది. ప్రభుత్వ బడుల్లో ప్రారంభించిన ఒకటి, రెండు రోజులు హడావుడి చేసి శానిటైజ్ చేశారు. ఆ తరవాత శానిటైజర్ల సరఫరా లేకపోవడంతో కొందరు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బుతో శానిటైజర్లు కొనుగోలు చేసి జాగ్రత్తలు పాటించారు.

  బడులు ప్రారంభించిన రెండు వారాల్లోనే 13 జిల్లాల్లో 232 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. కృష్ణా జిల్లా (Krishna district) పెదపారుపూడి పాఠశాలలో 12 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో బడిని మూసి వేశారు. ఇక ప్రకాశం జిల్లా (Prakasam district)లోనూ పాఠశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఉలవపాడు మండలం వీరేపల్లి పాఠశాలలో, వెలిగండ్ల మండలం వెదుళ్లపల్లి పాఠశాలల్లో 9 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. ఒంగోలు (Ongle) పీవీఆర్ బాలికల పాఠశాలలోనూ ముగ్గురు విద్యార్థినులు కరోనా భారిన పడ్డారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 22 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా భారిన పడ్డారు. విజయనగరం జిల్లా (Viziangaram) బొబ్బిలి రూరల్ గ్రామలో, విశాఖపట్నం (Visakhapatnam)లోని  గోపాలపట్నంలో పదుల సంఖ్యలో  విద్యార్ధులకు కరోనా బారిన పడ్డారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి: గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్.. మహిళా సర్పంచ్ నిర్ణయంపై ప్రశంసలు

  కరోనా సెకెండ్ వేవ్  (Corona Second Wave)పూర్తిగా తగ్గని నేపథ్యంలో స్కూల్స్ ఓపెన్ చేస్తే కరోనా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్ (ICMR)హెచ్చరించింది. కరోనా నియంత్రణకు కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. తరగతి గదుల్లో సామాజిక దూరం పాటించేలా ఒక్కో గదిలో 20 మందికి మించి విద్యార్థులను కూర్చోబెట్టవద్దని సూచించింది. ప్రభుత్వ బడుల్లో ఎక్కడా ఆ నిబంధన అమలు కావడం లేదు. ఒక్కో తరగతికి 50 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. ఒక్కో బెంచిలో నలుగురైదుగురు విద్యార్థులను కూర్చోబెట్టడంతో కరోనా వేగంగా వ్యాపిస్తోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠశాలల్లో విద్యార్ధులు అడుగుపెట్టే ముందు గేటు వద్దే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించాలి. ప్రభుత్వ బడుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ జరగడం లేదు కాబట్టి కరోనా ఉన్న విద్యార్థులు కూడా తరగతులకు హాజరవుతున్నారు. దీంతో తరగతిలోని మిగతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకుతోంది.

  ఇదీ చదవండి: గ్రామ సమస్యలపై సీఎంకు సర్పంచ్ లేఖ.. పరుగులు పెట్టిన అధికారులు.. ఏం జరిగిదంటే..?

  కరోనాను ఎదుర్కోవడంలో ప్రధాన ఆయుధం మాస్క్.. కానీ  బడుల్లో విద్యార్థులు పేరుకే మాస్కులు  ధరిస్తున్నారు. వాటిని మెడలో వేసుకోవడం, లేదంటే ముక్కు కిందకు లాగడం చేస్తున్నారు. విద్యార్ధులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడంతో బడుల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు చాలా మంది విద్యార్ధులు బస్సుల్లో వస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి జనాలను ఎక్కించుకోవడంతో అక్కడ కూడా విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోల్లోనూ అదే పరిస్థితి. పది మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకుని బడుల వద్దకు నడుపుతున్నారు. ఆటోలు, రిక్షాల్లో బడులకు రావద్దని ప్రభుత్వం  నిబంధనల్లో పొందుపరిచింది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్న దాఖలాలు లేవు.

  ఇదీ చదవండి: హిస్టరీ పై ప్రేమతో ఓ తండ్రి ఏం చేశాడంటే.. అతడి బిడ్డలకు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు..

  ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం చేసే సమయంలో విద్యార్ధులంతా గుంపులుగా చేరుతున్నారు. ఇది కరోనా వేగంగా వ్యాప్తికి  కారణమవుతోంది. ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిస్తోంది. మధ్యాహ్న భోజనం పెట్టే సమయంలో విద్యార్థులు క్యూలైన్లలో తోసుకోవడం కనిపిస్తోంది. ఇక్కడ కూడా సామాజిక దూరం పాటించడం లేదు. దీంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. పాఠశాలల్లో 5 కరోనా కేసులు వస్తే 14 రోజులు మూసి వేస్తున్నారు. రెండు వారాల్లోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 పాఠశాలల కరోనా  కారణంగా మూసివేసినట్టు అధికారులు చెబుతున్నారు.

  ఇదీ చదవండి: పెళ్లి వేడుకల్లో తప్పని సరి అయిన బుల్లెట్ బండి పాట.. అదరగొట్టిన మరో వధువు.. ఈ సారి ఎక్కడంటే..?

  పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా భారిన పడటంతో సెప్టెంబరు 5వ తేదీకల్లా ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందితోపాటు, మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వారికి కూడా రెండు డోసుల టీకాలు  వేసి ఉంటే వారి ద్వారా విద్యార్ధులకు సోకే ప్రమాదం చాలా వరకు తప్పేది. కానీ అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు

  ఇదీ చదవండి:ఛీ ఈమె ఒక అమ్మేనా.. ప్రియుడి మోజులో పసిబిడ్డపై ఉన్మాదం.. కన్నబిడ్డను హింసిస్తూ 250 వీడియోలు

  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, అఖిల భారత వైద్య మండలి నిపుణులు కొన్ని సూచనలు చేశారు. వీటికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ నిబంధనలు రూపొందించింది. అయితే వాటి అమలుకు అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో నిబంధనలు గాలికొదిలేశారు. కరోనా సోకిన తరవాత  వైద్య సేవలు అందించడం కన్నా అసలు కరోనా సోకకుండా అన్ని నిబంధనలు ఖచ్ఛితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రివెన్సన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ సత్యం ప్రభుత్వానికి తెలియదా అంటే? తెలుసనే చెప్పాలి. చిత్తశుద్ధి ఉంటే విద్యార్ధులు, ఉపాధ్యాయులు కరోనా భారినపడకుండా బడులు నడపొచ్చని మేధావులు సూచిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Schools, Corona casess, Corona second wave

  ఉత్తమ కథలు