హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Cases: పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి.. ఆ రెండు చోట్ల‌ భారీగా కేసులు 35.17శాతం పాజిటివిటీ రేట్‌!

Corona Cases: పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి.. ఆ రెండు చోట్ల‌ భారీగా కేసులు 35.17శాతం పాజిటివిటీ రేట్‌!

ఈ పరీక్షల వెనుక పెద్ద కుంభకోణం ఉందని తివారి ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల అండతో.. ప్రమాణాలు లేని ల్యాబ్‌లు కూడా రోజుకు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహించాయని తెలిపారు.

ఈ పరీక్షల వెనుక పెద్ద కుంభకోణం ఉందని తివారి ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల అండతో.. ప్రమాణాలు లేని ల్యాబ్‌లు కూడా రోజుకు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహించాయని తెలిపారు.

Corona Cases| దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టి దాక దేశ రాజ‌ధానిని వ‌ణికించిన క‌ర‌నా ఇత‌ర రాష్ట్రాల్లో వ్యాప్తి ప్రారంభ‌మైంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో మాత్రం కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కర్ణాటకలో 40,499 కేసులు వెలుగుచూశాయి. కేరళలో బుధవారం ఒక్క రోజే 34,199 కేసులు వ‌చ్చాయి.

ఇంకా చదవండి ...

  దేశంలో క‌రోనా కేసుల (Corona Cases)  సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టి దాక దేశ రాజ‌ధానిని వ‌ణికించిన క‌ర‌నా ఇత‌ర రాష్ట్రాల్లో వ్యాప్తి ప్రారంభ‌మైంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో మాత్రం కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కర్ణాటక (Karnataka) లో 40,499 కేసులు వెలుగుచూశాయి. నిన్న టితో (41,457) పోలిస్తే కాస్త తక్కు వే అయినప్పటికీ క‌రోనా కారణంగా మరో 21 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు 18.80 శాతానికి చేరింది. రాజధాని బెం గళూరులోనే 24,135 కేసులు వ‌చ్చాయి. ఐదుగురు మరణించారు. 1,84,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే దేశ రాజధాని దిల్లీ సహా ముంబాయిలోనూ కేసులు సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టాయి. కేరళలో బుధవారం ఒక్క రోజే 34,199 మం దికి వైరస్ నిర్ధరణ అయింది.


  కేర‌ళ‌ రాష్ట్రం లో మొత్తం కేసుల సం ఖ్య 54,41, 511కు చేరింది. మం గళవారం (28,481)తో పోలిస్తే.. 5,718 కేసులు అధికం గా నమోదయ్యా యి. కేర‌ళ‌ (Kerala) లో 91,983 పరీక్షలు నిర్వహిం చామని, 1.68 లక్షల క్రియాశీల కేసులు ఉన్న ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడిచిం ది. ఒక్క రోజే రాష్ట్రం లో 134 మం ది ప్రాణాలు కోల్పోయారు.

  Health Tips: క‌రోనా వేళ‌.. పిలల్ల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!

  అంతే కాకుండా కేర‌ళ‌లో దాదాపుగా క‌రోనా పాజిటివిటీ రేట్ 37.17 శాతం ఉంది. కేర‌ళ ఎర్నాకుళం జిల్లాలో పాజిటివిటీ రేట్ 44.59 శాతానికి పెరిగింది. తిరువనంతపురం జిల్లాలో అత్య‌ధికంగా కోవిడ్ పాజిటివిటీ రేట్‌ 45.8 శాతంగా ఉంది.

  దేశంలో మ‌ళ్లీ మూడో వేవ్ (Third Wave) ఉధృతి కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ముం బయిలోని జస్లోక్ ఆస్ప త్రి వైద్యు డు డాక్టర్ సంజయ్ నాగ్రాల్, కేరళలోని రాజ్గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిరియక్ ఫిలిప్, బెంగళూరుకి చెందిన డాక్టర్ రాజనీ భట్, యూఎస్, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖ‌లు ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. కరోనా విషయంలో సెకండ్ వేవ్ (Second Wave) స‌మ‌యంలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని వైద్యులు (Doctors) ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికిత్స విధానంలో మార్పులు అవ‌స‌రం అని వారు అభిప్రాయ పడ్డారు

  Omicron Symptoms: డెల్టాకు ఒమిక్రాన్‌కు తేడా ఏమిటీ.. ఒమిక్రాన్ అని ఎలా గుర్తుప‌ట్టాలి!

  ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువ‌గా గుర్తించిన ల‌క్ష‌ణాలు

  ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్ర‌త్యేకంగా లేవు.

  - డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొంద‌రిలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.

  Covid 19 Vaccination: 14.29కోట్ల మందికి వ్యాక్సిన్‌లు.. దేశంలో 9శాతం వ్యాక్సినేష‌న్ అక్క‌డే!

  - వేరియంట్ సోకిన‌వారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.

  - గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు.

  ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువ‌గా ఉంటాయి.

  - వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువ‌గా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Corona cases, Covid -19 pandemic, Karnataka, Kerala, Omicron

  ఉత్తమ కథలు