news18-telugu
Updated: March 27, 2020, 6:39 AM IST
ప్రతీకాత్మక చిత్రం
Coronavirus Outbreak | కరోనా విలయ తాండవానికి ప్రపంచం మొత్తం కుదేలవుతోంది. ఇందుగలడన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే గలడన్నట్లు కరోనా మొత్తం 200 దేశాల్లో పాగా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5,31,630 కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అమెరికాలో స్వైరవిహారం చేస్తోంది. కరోనా కేసుల్లో ఇప్పుడు ఆ దేశం టాప్ ప్లేస్‌లో ఉంది. అక్కడ 85,268 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 17,057 కొత్త కేసులు నమోదు కావడాన్ని బట్టి చూస్తే అమెరికా ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న యూఎస్‌లో 266 మంది కరోనాతో మృతి చెందారు. న్యూయార్క్, వాషింగ్టన్, లూసియానా, న్యూజెర్సీ , కాలిఫోర్నియా, టెక్సాస్, ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, మిచిగాన్, లోవా తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 30 వేల మంది బాధితులు ఉన్నారు.
కరోనా కేసుల్లో చైనా రెండో స్థానంలో ఉంది. ఆశ్చర్యకరంగా ఆ దేశంలో నిన్న కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అంతేకాదు.. ఏ ఒక్కరూ మరణించలేదు. ఆ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 74,051 మంది కోలుకున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం 3,947 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఆ తర్వాత ఇటలీలో 80,589.. స్పెయిన్‌లో 57,786.. జర్మనీలో 43,938 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 722 కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజే 88 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 16 మంది కోవిడ్ వ్యాధితో మృతి చెందారు.
గణాంకాలివీ :
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు : 5,31,630
మరణాలు : 24,065
కోలుకున్నవారు : 1,23,391
ఇంకా కరోనాతో బాధపడుతున్నవారు 3,84,174
Published by:
Shravan Kumar Bommakanti
First published:
March 27, 2020, 6:39 AM IST