Home /News /coronavirus-latest-news /

CORONA CASES ON THE RISE AGAIN IN INDIA HOLIDAY EXTENSION FOR EDUCATIONAL INSTITUTIONS IN MANY STATES SNR

భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona: భారత్‌లో కరోనా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుంటే థర్డ్‌వేవ్‌ ప్రభావం చాలా రాష్ట్రాలపై పడేలా కనిపిస్తోంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా పాజివిట్ కేసులు పెరగడంతో ఆక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

ఇంకా చదవండి ...
భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్‌ కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 2,71,202పాజిటివ్ కేసులు (Positive cases)నమోదయ్యాయి. మొత్తం 16.65లక్షల మందికి పరీక్షలు చేయగా..అందులో సుమారు 2,71,202మంది వైరస్‌ బారినపడినట్లు నిర్ధారణైంది. ఇందులో 314మంది మృతి చెందారు. ఒమిక్రాన్‌ (Omicron)కేసుల సంఖ్య 7743కి చేరుకుంది. నిన్నటి కేసులతో పోలిస్తే కొత్త కేసుల్లో సుమారు 28.17శాతం పెరిగినట్లుగా అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 15.50లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజులో 1.38లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94.51శాతానికి తగ్గింది. మహారాష్ట్ర(Maharastra)కు థర్డ్‌వేవ్‌ థ్రెట్‌ (Third wave threat)తప్పేలా లేదు. ఇక్కడ మరోసారి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 41,327మందికి వైరస్‌ సోకింది. మహమ్మారి బారినపడి 24గంటల్లో 29మంది చనిపోయారు. ముఖ్యంగా పోలీస్‌శాఖ(Police department)పై మహమ్మారి పంజా విసురుతోంది. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న 63మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 127మంది పోలీస్ సిబ్బంది చనిపోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 265346గా ఉంది. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1738 ఒమిక్రాన్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

థర్డ్‌వేవ్‌ నుంచి బయటపడేదెలా..
తమిళనాడులో కోవిడ్‌ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 23,989పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి 11మంది మృత్యువాత పడ్డారు. వండలూరు జూగా ప్రసిద్ధికెక్కిన అరినగర్‌ అన్నా జులాజికల్ పార్కులో పనిచేస్తున్న 80మంది సిబ్బంది పాజిటివ్‌గా నిర్ధారణైంది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జూ అధికారులు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించడంతో సిబ్బంది వైరస్ బారినపడినట్లు తేలింది. కేసులు పెరుగుతున్న దృష్ట్య చెన్నై ట్రేడ్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ సపోర్ట్‌తో కూడిన 950 బెడ్లను సిద్ధం చేశారు. అయితే ట్రేడ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తమిళనాడు మంత్రి తెలిపారు.

ముంచుకొస్తున్న ముప్పు..
ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా కరోనా కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 15,700పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క లఖన్‌పూర్‌లోనే 2,769పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో యోగీ సర్కారు స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవులను పొడిగించింది. ముందుగా ఆదివారం వరకూ సెలవులు ప్రకటించినప్పటికి రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈనెల 23వరకూ సెలవులను కొనసాగించాలని ఆదేశించింది. అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతుల్ని కొనసాగించాలని సూచించింది.

అన్నీ చోట్ల అదే పరిస్థితి..
కేరళలో కూడా కరోనా కలకలం రేపుతోంది. కొత్తగా 18,123పాజిటివ్ కేసులు నమోదవగా..మహమ్మారి బారినపడి 8మంది మృతి చెందారు. రాష్ట్రంలో లక్ష3వేల 864యాక్టివ్ కేసులున్నాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Covid cases, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు