దేశంలో ఆగిన కరోనా జోరు.. అదొక్కటే ఊరట..

Corona Lockdown | Corona Update : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి.

news18-telugu
Updated: June 18, 2020, 10:07 AM IST
దేశంలో ఆగిన కరోనా జోరు.. అదొక్కటే ఊరట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : దేశంలో కరోనా జోరు ఆగడం లేదు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి... దేశంలో కోరలు చాస్తోంది. తాజాగా... 24 గంటల్లో 12881 మందికి కరోనా సోకింది. ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 366946కి చేరింది. ఇక కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12237కు చేరింది. ప్రస్తుతం ప్రస్తుతం యాక్టివ్ కేసులు 160384గా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 194324కు చేరింది.

దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 53 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు, రికవరీ కేసుల మధ్య తేడా 33940గా ఉంది. అసోం, బీహార్, చత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల కంటే రికవరీ అయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 26 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలకు తక్కువగా ఉంది. ఇక రోజూవారీ కొత్త కేసుల విషయంలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే ముందు బ్రెజిల్, అమెరికా ఉన్నాయి, గడిచిన 24 గంటల్లో దేశంలో 165412 కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 6249668కు చేరుకుంది.

Corona virus cases in india, new corona virus cases in india, corona virus india
దేశంలో కరోనా కేసులు అప్‌డేట్


కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 116752 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5651 మంది చనిపోయారు. ఇక 47102 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ రెండోస్థానంలో ఉంది. కరోనా కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1904 మంది చనిపోయారు. ఇక ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కూడా కరోనా వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
First published: June 18, 2020, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading