ఒక్క కరోనా కేసు కూడా లేని మంచిర్యాలలో ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది..

ఇంతకుముందు జిల్లాలో ఒక అంకె దాటని కేసుల సంఖ్య రెండంకెలు దాటింది.

news18-telugu
Updated: June 28, 2020, 8:43 PM IST
ఒక్క కరోనా కేసు కూడా లేని మంచిర్యాలలో ఇప్పుడు  కరోనా విజృంభిస్తోంది..
ఒక అంకె దాటని కేసుల సంఖ్య రెండంకెలు దాటింది
  • Share this:
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం జిల్లా ప్రజలను కలవరపెడుతొంది. ఇంతకుముందు జిల్లాలో ఒక అంకె దాటని కేసుల సంఖ్య రెండంకెలు దాటింది. ఒక్కసారిగా 48 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతొంది. ఒక అంకె దాటని కేసుల సంఖ్య రెండంకెలు దాటింది. మొదటిసారి జిల్లా కేంద్రంలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వస్త్ర వ్యాపారి ద్వారా ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్దారించారు. స్థానిక రిపోర్టర్ కు ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు నోడల్ అధికారి తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ ల ద్వారా 9 మంది నమూనాలు టెస్టులకు పంపగా నలుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు సమాచారం. నోడల్ అధికారి మాత్రం ధృవీకరించలేదు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలకు వలస పోయి వచ్చిన వలస కూలీలతో ప్రారంభమైన కరోన పాజిటివ్ ల సంఖ్య నేడు స్థానికులకు కూడా వైరస్ సోకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ సోకిన స్థానికుల నుండి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 24 మందికి కరోనా పాజిటివ్ లు రాగా, మరో 17 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు జిల్లాలోని బెల్లంపల్లిలో ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు రాగ, మందమర్రి లో ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో 37 మంది వలస వెళ్లి వచ్చిన కూలీల కు మాత్రమే వచ్చింది.అలాగే వారి నుండి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో స్థానికులకు కరోనా పాజిటివ్ 16 మందికి రాగా వారి ద్వారా ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా 24 మందికి కరోనా పాజిటివ్ సోకింది. జిల్లాలో మొత్తం 79 మందికి కరోనా పాజిటివ్ సోకాగా 49 మంది కరోనా పాజిటివ్ నుండి కోలుకొని డిచ్చార్జ్ అయినారు. 29 మంది ఆక్టివ్ కేసులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాజా కేసులతో ఆ సంఖ్య మరింత పెరిగింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు నివసించే వార్డులను రెడ్ జోన్ చేసి కంటోన్మెంట్ ఏరియా గా ప్రకటించారు. కరోనా సోకిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ చేసి వారికి సంబంధించిన నమూనాలను టెస్ట్ ల కోసం ఆస్పత్రులకు పంపించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటయిన్ కు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కొంతమంది హైదరాబాద్ పంపించగా మరికొందరిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
First published: June 28, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading