Corona effect: మా ఊరికి రావొద్దు.. స్వీయ నిర్బంధంలో ఆ గ్రామాలు.. ఎక్కడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Corona Effect: రోజు రోజుకు కరోనా విలయతాండవానికి గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛంద లాక్ డౌన్‌ విధించుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు స్వీయ నిర్బంధం పాటించనున్నట్లు ప్రకటించారు

 • Share this:
  రోజు రోజుకు కరోనా విలయతాండవానికి గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛంద లాక్ డౌన్‌ విధించుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు స్వీయ నిర్బంధం పాటించనున్నట్లు ప్రకటించారు . కరోనా మహమ్మారి గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరినీ అతలా కుతలం చేసస్తుంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంటో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కరోజే ఆదిలాబాద్ జిల్లాలో 343 కేసులు నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 219, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. కాగా అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 359 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలోని ప్రజలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు స్వచ్ఛందంగా స్వీయ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు.

  గ్రామ పెద్దలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు చర్చించుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో స్వచ్చందంగా తమకు తామే లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు. వ్యాపారస్తులతో గ్రామ పంచాయతీ ప్రతినిధులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూర్తిగా మార్కెట్ మూసివేయాలని, ప్రతి మంగళవారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించుకోవడమేకాకుండా గ్రామ పంచాయతీ ఆదేశాలు కూడా జారీ చేసింది. వీరి బాటలోనే పక్కనే ఉన్న సోనాల తదితర గ్రామాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. అటు నిర్మల్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగావ్, తానూర్ మండలం బోసి గ్రామంలో ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకొని అమలుచేస్తున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్తపెల్లి గ్రామంలో కూడా అక్కడి ప్రజలు స్వీయ లాక్ డౌన్ అమలుచేస్తున్నారు. మరోవైపు కరోనా జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరిచేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జనసమ్మర్ధ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరికలు జారి చేశారు. మొత్తంమీద మరోసారి కరోనా ఉధృతి తీవ్రం కావడంతో అధికారులతోపాటు గ్రామ ప్రజలు అప్రమత్తమై దాని కట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: