Corona Cases In India: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇప్పుడు భారత దేశాన్ని కూడా టెన్షన్ పెడుతోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మన దేశంలో ఒమిక్రాన్ (Omicron) సెంచరీకి చేరువ అవుతోంది. ఇలాంటి సమయంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ముంబయిలోని ఓ పాఠశాలలో 16మంది విద్యా ర్థుకు వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తం అయింది. విద్యార్థులకు కోవిడ్ కేర్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కోవిడ్ సోకిన వారిలో 8 నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
Monkeys Revenge: కుక్కలపై కోతుల ప్రతీకారం.. మహారాష్ట్రలో 250 కుక్కలను చంపిన కోతులు!
ఏం జరిగింది..?
ముంబాయి (Mumbai) ఘన్సోలీ గోవతిలోని షెట్కారీ శిక్షణ్ సంస్థ స్కూల్లో 11 క్లాస్ విద్యార్థి తండ్రి ఖతార్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. విద్యార్థి తండ్రికి కరోనా పరీక్ష చేయగా నెగెటీవ్ వచ్చింది. కుటుంబ సభ్యులకు చేయగా విద్యార్థికి వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పరీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 600మంది విద్యార్థులకు కరోనా పరీక్ష చేశారు. ఇందులో 16 మందికి పాజిటివ్ సోకినట్టు గుర్తించారు.
భారత ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటి దాకా 15 ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఈ 15మందిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవు. వీళ్లలో 13 మంది ఇప్పటికే కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య 40కి చేరుకుంది. ఢిల్లీ(22) కేసులు, రాజస్థాన్ 17, కర్ణాటక 8, తెలంగాణ 8, గుజరాత్ 5, కేరళ 7, ఆంధ్రప్రదేశ్ 1, ఛండీగఢ్ 1, తమిళనాడు 1, వెస్ట్ బెంగాల్ లో 1 కేసుతో మొత్తంగా 11 రాష్ట్రాల్లో 111 ఒమిక్రాన్ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విదించిన ప్రభుత్వాలు.. అసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు కలకలం రేపుతున్నాయి. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు పెంచుతున్నాయి. అయితే ఒమిక్రాన్ కొత్త లక్షణాలపై వైద్య బృందం పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నా రని అన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో భిన్న మైన లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. కొవిడ్ 19 సాధారణ లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం , గొం తు నొప్పి , తీవ్రమైన జ్వ రం వం టివి కొత్త వేరియం ట్ బాధితుల్లో లేవని వైద్యులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, India, Mumbai, Omicron, Omicron corona variant, Schools