దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కోవిడ్ -19 (Covid-19) సగటు మనిషి జీవితాన్ని అన్ని విధాలా ప్రభావితం చేసింది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నా, భారత్‌లో మాత్రం వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీంతో ఇక దీని ముప్పు ఉండకపోవచ్చని News18.comతో చెప్పారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్. డబ్య్లూహెచ్ఓ (World Health Organization) ఒమిక్రాన్ తర్వాత కొత్త వేరియంట్‌ని దేనినీ గుర్తించకపోవడం మంచి విషయమని తెలిపారు.
మన దేశంలోనే టాప్ ఎపిడెమియాలజిస్ట్ అయిన రామన్ కోవిడ్ -19 వ్యాప్తిపై న్యూస్18తో మాట్లాడారు. ఇంతకు ముందు ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త వేవ్ వచ్చిందని, కానీ గత సంవత్సరంగా ప్రపంచవ్యాప్తంగా అదే ఓమిక్రాన్ వేరియంట్ కొనసాగుతోందని తెలిపారు. ‘మొదట వచ్చిన వూహాన్ వైరస్ నుంచి ఒమిక్రాన్ వరకు మొత్తం 37 మ్యుటేషన్లను గుర్తించారు. మందులను ఎదుర్కొనేందుకు ఒక వేరియంట్‌తో మరో వేరియంట్ కలిసి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. మనిషి శరీరంలో చేరిన తర్వాత ఎన్నో రూపాలు మార్చుకున్నాయి. దీంతో మనలో రోగ నిరోధక శక్తి చాలా ఒత్తిడికి గురైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సంబంధిత వైరస్‌లే ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న మార్పులున్నాయి గానీ పెద్ద తేడా లేదు. ఇప్పుడు కూడా ఈ వైరెస్ ఇన్ఫెక్షన్లను కలిగిస్తూనే ఉంది. అయితే లక్షణాల తీవ్రత మాత్రం బాగా తగ్గింది.’ అని రామర్ వెల్లడించారు.
* వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది
ఒమిక్రాన్(Omicron) మొదటిసారిగా గత నవంబర్‌లో కనిపించింది. ఇప్పటికి సంవత్సరం గడిచింది. ఈ నవంబర్ వరకు దీని వంశానికి చెందిన రకాలే కనిపించాయి గానీ ఇతర రూపాంతరాలు కనిపించలేదు. వీటి వల్ల పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. ఆసుపత్రుల్లో రోగుల చేరికలు ఏమీ పెరగలేదు. మరణాలూ తగ్గాయి. అయితే జాగ్రత్తలు తప్పనిసరి. ఎవరైనా రెండోసారి కోవిడ్‌కు గురైతే లక్షణాలు తక్కువగానే ఉన్నా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఉంటోంది. అయితే బూస్టర్ డోస్ తీసుకున్నవారిలో తీవ్రత తక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. బూస్టర్లు తీసుకోవడం రిస్క్‌ని తగ్గిస్తుందని రామన్ తెలియజేశారు. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనడంలో ఇప్పుడు నిఘాను మరింత పెంచిందన్నారు.
ISRO : ఇస్రో సరికొత్త అధ్యాయం.. నింగిలోకి విజయవంతంగా ప్రైవేట్ రాకెట్ ప్రయోగం
OMG: గరిటలా మారిన జేసీబీ... ప్రసాదం తయారీకి ప్రొక్లెయిన్లు, కాంక్రీట్ మిక్సర్లు..
* మాస్క్‌లు తప్పనిసరే
వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరిగేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని రామన్ తెలిపారు. పబ్లిక్ గెట్-టు గెదర్స్, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు తాను కూడా తప్పని సరిగా మాస్క్ వాడతానని చెప్పారు. మన సొంత భద్రత కోసం, లైఫ్స్టైల్లో భాగంగా మాస్క్ వాడటంలో తప్పేం లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus