హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Third Wave: నారా లోకేష్ కు కరోనా పాజిటివ్.. రాజకీయ నేతలపై వైరస్ దాడి

Corona Third Wave: నారా లోకేష్ కు కరోనా పాజిటివ్.. రాజకీయ నేతలపై వైరస్ దాడి

Corona Third Wave: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా రాజకీయ నేతలను కరోనా వదలడం లేదు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం కరోనా బారిన పడ్డారు..

  Corona Third Wave:  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో కంటే రెట్టింపు వేగంతో కరోనా (Corona)బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ సారి సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు ఎవరినీ వైరస్ వదలడం లేదు. తొలి రెండు వేవ్ లతో పోల్చుకుంటే మూడో వేవ్ లో రాజకీయ నేతలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. అయితే అందులో ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు వరుసగా పాజిటివ్‌ వచ్చినట్లుగా తేలడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని కూడా వైరస్ భయపెడుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. స్వయంగా దీనిపై  నారా లోకేష్.. ట్వీట్ చేశారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే లోకేష్ కు కరోనా నిర్ధారణ అయ్యింది.

  తాజాగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. అయినా ఎలాంటి లక్షణాలు లేవని..  తాను తిరిగి కోలుకున్నంత వరకు హో ఐసోలేషన్ లోనే ఉంటాను అన్నారు.  ఇటీవల కాలంలో తనను కలిసినవారంతా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని..  ఎవరికైనా లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలని.. లేదా హోం ఐసోలేషన్ లో ఉండాలని కోరారు..

  కరోనా థర్డ్ వేవ్ లో ఏపీలో పలువురు రాజకీయ పార్టీల నేతలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నారా లోకేష్ కు పాజిటివ్ నిర్ధారణ కగా.. అధికార పార్టీ నేతలు, మంత్రులు భారీగా కరోనా బారిన పడుతున్నారు.

  ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి సతీమణికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. స్పల్ప లక్షణాలు ఉండటంతో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చినట్లుగా స్వయంగా వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన దిగ్గలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna rambabu)తో పాటు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni srinivasa reddy)సతీమణి శచీదేవి(Sachi devi)కి కూడా కరోనా సోకింది. ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌(Isolation)లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మంత్రి కూడా సతీమణితో పాటు ఐసోలేషన్‌లో ఉన్నారు. తమను కలిసేందుకు ఎవరూ రావద్దని సూచించారు. గత రెండు, మూడ్రోజులుగా తమను కలిసి వాళ్లు కూడా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి (Ugra Narasimha Reddy)కరోనా బారినపడ్డారు.

  ఇదీ చదవండి : 111 ఏళ్ల బామ్మ బర్త్‌డే వేడుకలు.. ఆమె ఆరోగ్యం సీక్రెట్ ఇదే.. ఎన్నో ప్రత్యేకతలు

  అంతకముందు మత్రి కోడాలి నాని, టీడీపీ లీడర్ వంగవీటి రాధ కూడా కరోనా బారిన పడి.. హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుటన్నారు. అయితే తొలి, సెకెండ్ వేవ్ తో పోలీస్తే.. థర్డ్ వేవ్ లో రాజకీయ నేతలు భారీగానే కరోనా భారిన పడుతున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona casess, Nara Lokesh

  ఉత్తమ కథలు