Corona : దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్​ వేవ్​.. భారత్​ను రెడ్ లిస్ట్ లో చేర్చిన ఆ దేశం..

ప్రతీకాత్మక చిత్రం

Corona : ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా ఉతృతి వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు భారత్​కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా, బ్రిటన్ , హాంకాంగ్​ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాయ్.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​వేవ్​ విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజుల నుంచి రోజుకు లక్షకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక, ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా ఉతృతి వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు భారత్​కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా, బ్రిటన్ , హాంకాంగ్​ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాయ్. బ్రిటన్ అయితే భారత్ ను రెడ్ లిస్ట్ లో చేర్చింది. ఇక, భారత్–హాంకాంగ్​ మధ్య విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్​ విమానయాన శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబై నుంచి హాంకాంగ్​ వెళ్లే విమానాలన్నింటినీ ఏప్రిల్​ 20 నుంచి మే 2 వరకు 14 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారతదేశంతో పాటు పాకిస్తాన్​, ఫిలిప్పైన్స్​ దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా దేశాల విమాన రాకపోకలపై కూడా నిషేధం విధించింది. ఆయా దేశాల నుండి ఈ నెలలో రెండు విస్తారా విమానాల్లో వచ్చిన 50 మంది ప్రయాణీకులకు కోవిడ్​ పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, భారత్​లో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఇటీవలే న్యూజిలాండ్ ప్రభుత్వం భారత ప్రయాణీకులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ దేశం తర్వాత భారతకు విమాన రాకపోకలను నిషేధించిన రెండో దేశం హాంకాంగ్ కావడం గమనార్హం.

విమాన రాకపోకలపై ఎందుకు నిషేధం?
భారత్​కు విమాన రాకపోకలపై నిషేధం విధించడాన్ని హాంకాంగ్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘హాంకాంగ్​ ప్రజల్లో మొదటిసారిగా N501Y ఉత్పరివర్తన గల కరోనా వైరస్​కు సంబంధించిన కేసులు కనుగొనబడ్డాయి. భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో గత ఏడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందువల్లే, మా డిసీజ్​ కంట్రోల్​ విభాగం సూచన మేరకు ఆయా దేశాల నుంచి తాత్కాలికంగా 14 రోజుల పాటు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాం.”అని అన్నారు.

పాకిస్తాన్​, ఫిలిప్పీన్స్​పై కూడా..
ఏప్రిల్ 18న ముంబై నుండి హాంకాంగ్​కు వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్​ నిర్ణారణ అయ్యింది. అంతకంటే ముందు ఏప్రిల్​ 4న ఢిల్లీ నుంచి హాంకాంగ్​కు వెళ్లిన ప్రయాణికులకు అక్కడ కరోనా టెస్ట్​ చేయగా 47 మందికి పాజిటివ్​గా వచ్చింది. దీంతో, ఏప్రిల్ 6 నుండి విమాన రాకపోకలకు నిషేధం విధించారు. అయితే, ఇప్పుడు కేసులు మరింతగా పెరుగుతుండటంతో భారత్​ను టచ్​ చేసే అన్ని విమానాలను మే 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్​ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, హాంకాంగ్​లో నమోదవుతున్న కేసుల్లో 22 కేసులు భారత్​కు చెందిన వారేనని, మరికొందరు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, కెనడా వంటి దేశాలకు చెందినవారని ప్రభుత్వం తెలిపింది. ప్రయాణీకులను విమానంలోకి అనుమతించే ముందు ఆయా విమానయాన సంస్థలు కరోనా రిపోర్ట్​ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కోరింది.
Published by:Sridhar Reddy
First published: