ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా (Corona)బారినపడుతున్న వారిలో ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు వరుసగా పాజిటివ్ వచ్చినట్లుగా తేలడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి సతీమణికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. స్పల్ప లక్షణాలు ఉండటంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లుగా స్వయంగా వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన దిగ్గలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna rambabu)తో పాటు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni srinivasa reddy)సతీమణి శచీదేవి(Sachi devi)కి కూడా కరోనా సోకింది. ఆమె ఇంట్లోనే ఐసోలేషన్(Isolation)లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మంత్రి కూడా సతీమణితో పాటు ఐసోలేషన్‌లో ఉన్నారు. తమను కలిసేందుకు ఎవరూ రావద్దని సూచించారు. గత రెండు, మూడ్రోజులుగా తమను కలిసి వాళ్లు కూడా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి (Ugra Narasimha Reddy)కరోనా బారినపడ్డారు. ఏపీలో థర్డ్‌వేవ్ (Third Wave)డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే రోజు వారి కేసుల సంఖ్య నాలుగు వేలు దాటిపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు సంక్రాంతి వేడుకల నేపధ్యంలో చాలా చోట్ల భౌతికదూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటి చర్యలతో కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. 2022లో ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది.
ఏపీకి ముప్పు తప్పదా..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(Ambati rambabu)కు సైతం వైరస్ సోకింది. తనకు మూడో సారి పాజిటివ్ వచ్చిందని..జలుబు, ఒళ్లు నొప్పులు రావడంతో టెస్ట్‌లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తనను ఎవరూ కలవొద్దని అందరూ మాస్క్‌లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు అంబటి రాంబాబు. భోగి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మాస్క్ ధరించకుండానే గిరిజన మహిళలతో కలిసి ఆయన సాంప్రదాయ నృత్యాలు వేశారు. ఈ కారణంగానే ఆయనకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అంబటి రాంబాబు ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
“మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ముఖ్య గమనిక”
నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసి వారంతా వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లి, పరీక్షలు చేయించుకోవలని మనవి. — Anna Rambabu MLA (@AnnaRambabu) January 16, 2022
#ysrcp MLA Ambati Rambabu tested #CoronaPositive for 3rd time and is in #Quarantine.#AndhraPradesh pic.twitter.com/SsGbUL53Kb
— P Pavan (@PavanJourno) January 16, 2022
ఇప్పటికైనా జాగ్రత్త పడండి..
సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ప్రజలు బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపువుతున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.