24 గంటల్లో 1230 కేసులు.. కరోనా కోరల్లో మహారాష్ట్ర

గడిచిన 24 గంటల్లో ఏకంగా 1230 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 36 మంది మరణించారు.

news18-telugu
Updated: May 11, 2020, 9:12 PM IST
24 గంటల్లో 1230 కేసులు.. కరోనా కోరల్లో మహారాష్ట్ర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చింది. సోమవారం కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటింది. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1230 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 36 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 23401కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 830 మంది మరణించారు.


మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 791 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది చనిపోయారు. తాజా కేసులతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,355కి చేరింది. ఇప్పటి వరకు 528 మంది మరణించారు.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4213 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 1559 మంది డిశ్చార్జ్ కాగా.. 97 మంది మరణించారు. తాజా లెక్కలు కలిపి భారత్‌లో ఇప్పటి వరకు 67,152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 20,917 కోలుకోగా... ఇప్పటి వరకు 2,051 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 44,029 యాక్టివ్ కరోనా కేసులున్నాయి
First published: May 11, 2020, 9:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading