రైళ్లు ఆపేసినా మంచి పని చేస్తున్న రైల్వే

అన్నార్తులకు ఆహారాన్ని అందజేసింది రైల్వే శాఖ. ఢిల్లీ, నిజాముద్దీన్, మరో రైల్వే స్టేషన్‌లో పేదలకు ఆహార పొట్లాలను అందజేసింది.

news18-telugu
Updated: March 28, 2020, 11:12 PM IST
రైళ్లు ఆపేసినా మంచి పని చేస్తున్న రైల్వే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వేస్ ఓ మంచి పనిచేస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆపన్నులను ఆదుకునేందుకు రైల్వేస్ తన వంతుగా ముందుకొచ్చింది. ఆకలితో ఉన్న అన్నార్తులకు ఆహారాన్ని అందించింది. మార్చి 28వ తేదీన ఢిల్లీ, నిజాముద్దీన్, షక్రుబస్తి రైల్వే స్టేషన్లలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని అందించింది. పూర్తిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఐఆర్‌సీటీసీ కిచెన్లలో అత్యంత స్వచ్ఛంగా తయారు చేసిన ఆహార పదార్థాలను, అలాగే, పేదవారికి అందించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రోజు సుమారు 2000 ఆహార ప్యాకెట్లను ఉచితంగా అందజేసినట్టు తెలిపింది.

మరోవైపు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భోగీలలో ఐసోలేషన్ వార్డులుగా ఏర్పాటు చేసింది. ఆగిపోయిన రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్ కోచ్ లను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సరైన వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్యసదుపాయలను అందించే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న 13వేలపైగా రైళ్లు నడిచే భారత్ లో.. రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల మొత్తం 3 లక్షల బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.
First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading