కరోనా కిట్ల రేట్లపై వివాదం.. ఛత్తీస్‌గఢ్‌లో రూ.337, ఏపీలో రూ.730

కరోనా కిట్ల రేట్లపై వివాదం.. ఛత్తీస్‌గఢ్‌లో రూ.337, ఏపీలో రూ.730

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుకున్న సీఎం జగన్ (File)

ఛత్తీస్‌గఢ్‌లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.730 చెల్లించింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన కరోనా వైరస్ టెస్ట్ కిట్ల ధరల మీద వివాదం నెలకొంది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.730 చెల్లించింది. 2లక్షల కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేసింది. అందుకు రూ.14.60 కోట్లు అయింది. ఓ రకంగా చూస్తే ఛత్తీస్ గఢ్ చెల్లించిన ధర కంటే రెట్టింపు ధరను ఏపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే, మొత్తం 8లక్షల కిట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసినట్టు తెలిసింది. అందులో 25 శాతం ధర రూ.14.60 కోట్లు. అందులో తొలిదశలో లక్ష కిట్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన డబ్బులు కిట్లు మొత్తం విజయవాడకు డెలివరీ అయిన తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది.

  2 లక్షల కరోనా కిట్లను రూ.14.60 కోట్లకు కొనుగోలు చేసిన ఏపీ ప్రభుత్వం


  ఛత్తీస్‌గఢ్‌లో 75,000 హై క్వాలిటీ కిట్ల కొనుగోలు కోసం ఒక్కో దానికి రూ.337 ప్లస్ జీఎస్టీ చెల్లించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. భారత్‌లో ఉన్న ఓ దక్షిణ కొరియా సంస్థ నుంచి తాము ఈ కిట్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. భారత్‌లో ఇదే అత్యంత తక్కువ ధర అని కూడా తెలిపారు. భారత్‌లో ఉన్న  దక్షిణ కొరియా అంబాసిడర్, దక్షిణ కొరియాలో ఉన్న భారత్ అంబాసిడర్‌తో నిరంతరం మాట్లాడి తక్కువ ధరకు కొనుగోలుచేసినట్టు చెప్పారు.  ఈ విషయం రాజకీయంగా వివాదం చెలరేగింది. కరోనా కిట్లలో కమిషన్ కొట్టేశారా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేయడం పెద్ద దుమారం రేపింది.  అయితే, కరోనా కిట్ల విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం ధర మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఈ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొన్నవి భారత్‌లో తయారైనవని, వాటి ద్వారా పరీక్షలు చేస్తే 30 నిమిషాల్లో టెస్ట్ రిజల్ట్స్ వస్తుందని, జగన్ కొరియా నుంచి  తెప్పించారని వాటి ద్వారా టెస్ట్ చేస్తే 10 నిమిషాల్లోనే ఫలితం వస్తుందని చెప్పారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు