కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా ?

కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 26, 2020, 6:51 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా ?
అభిషేక్ సింఘ్వీ(ఫైల్ ఫోటో)
  • Share this:
లాక్‌డౌన్ మినహాయింపుల తరువాత దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అనేకమంది రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. పెద్దగా కరోనా లక్షణాలు లేవని... కొద్దిపాటి జ్వరం మాత్రమే ఉందని సమాచారం. సింఘ్వీకి కరోనా అని తేలడంతో ఆయన కుమారుడుతో పాటు ఇతర కుటుంబసభ్యులు, కార్యాలయ సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే సింఘ్వీకి కరోనా సోకిందనే అంశంపై కాంగ్రెస్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేత సంజయ్ ఝా కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంధ్ర జైన్ సైతం కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించే పరిస్థితి రావడంతో... డాక్టర్లు ఆయనకు ప్లాస్మా థెరపీ నిర్వహించారు. దీంతో ఆయన ఆరోగ్యం మెరుగైంది. ఈ రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.




First published: June 26, 2020, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading