HOME »NEWS »Corona vilayatandavam »congress mp komatireddy venkat reddy tested positive for coronavirus su

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా పాజిటివ్

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా పాజిటివ్
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Share this:
    కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో.. ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇటీవలికాలంలో తనను కలిసి కాంగ్రెస్ నేతలు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆయన ప్రచార నిర్వహిస్తున్నారు.

    ఇక, తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం రోజున 38,565 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 39,78,869 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు పేర్కొంది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే కరోనాతో 5 గురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతలు సంఖ్య 1,292కి చేరింది.బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,717 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,06,105కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 20,183 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 16,977 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

    Published by:Sumanth Kanukula
    First published:October 22, 2020, 15:12 IST

    टॉप स्टोरीज