తెలంగాణలో డిసెంబర్‌కు వరకు లాక్‌డౌన్ ఉండాలి.. ఎమ్మెల్యే డిమాండ్

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1001 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 316 మంది కోలుకోగా.. 15 మంది మరణించారు.

news18-telugu
Updated: April 27, 2020, 5:44 PM IST
తెలంగాణలో డిసెంబర్‌కు వరకు లాక్‌డౌన్ ఉండాలి.. ఎమ్మెల్యే డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ ఉంది. ఐతే ఆ తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా? లేదంటే మళ్లీ పొడిగిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఐతే గ్రీన్ జోన్లలో ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేవలం హాట్ స్పాట్స్‌లోనే కఠిన నిబంధనలను అమలు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా డిసెంబరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కరోనా ఇప్పట్లో పోయేది కాదని.. లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే ఇన్నాళ్లు పడిన కష్టం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు జగ్గారెడ్డి. మే తర్వాత వరుసగా పండగలు వస్తాయని.. జనాలు గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని అన్నారు.

తెలంగాణలో డిసెంబరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలి. అలా చేస్తేనే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వానికి మంచిది. మే తర్వాత వరుసగా పండగలు వస్తాయి. బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, మొహరం, దీపావళి, క్రిస్మస్ పండగలు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా గుమిగూడడంతో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. పండగల కోసం లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇన్నాళ్లు పడిన కష్టం వృథా అవుతుంది. ఇంకా 6 నెలల పాటు పొడిగించినా ప్రజలు వ్యతిరేకించరు. ముందు మనం బతికితేనే అన్నీ చూడగలుగుతాం. ఐతే పేద ప్రజలను ఆదుకోవాలి. తినేందుకు ఆహార ధాన్యాలు, సరుకులను అందజేయాలి. ఈ దిశగా పార్టీ కూడా ఆలోచన చేయాలని ఉత్తమ్‌ కుమార్‌ని కోరుతున్నా. సీఎం కూడా డిసెంబరు వరకు లాక్‌డౌన్ పొడిస్తారని అనుకుంటున్నా.
జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే


Telangana congress mla jaggareddy interesting comments ఆస్తులు అమ్ముకొనైనా సరే గెలవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. డబ్బు సంపాదన కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తానని వ్యాఖ్యానించారు.
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

కాగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1001 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 316 మంది కోలుకోగా.. 15 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 660 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధిక GHMC పరిధిలోనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు 540 కరోనా కేసులు నమోదవగా.. 18 మంది మరణించారు.

Published by: Shiva Kumar Addula
First published: April 27, 2020, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading