పాక్ ఫొటోతో భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత నిందలు...

నరేంద్ర మోదీ తీసుకొచ్చిన లాక్ డౌన్ వల్ల వలసకూలీలు ఎంత బాధపడుతున్నారో చూడండంటూ ఏఐసీసీ అధికారి ప్రతినిధి, తమిళనాడుకు చెందిన అమెరికై వి నారాయణన్ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: April 16, 2020, 9:12 PM IST
పాక్ ఫొటోతో భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత నిందలు...
కాంగ్రెస్ నాయకుడు అమెరికై వి నారాయణన్ పోస్ట్ చేసిన ఫొటో (Image;Twitter)
  • Share this:
పాకిస్తాన్‌కు సంబంధించిన ఓ ఫొటోతో కాంగ్రెస్ నేత భారత ప్రభుత్వంపై నిందలు వేశారు. నరేంద్ర మోదీ తీసుకొచ్చిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారో చూడండంటూ ఏఐసీసీ అధికారి ప్రతినిధి, తమిళనాడుకు చెందిన అమెరికై వి నారాయణన్ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ సొంత గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లారని, అలా వెళ్లిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, నడవడం వల్ల వారి పాదాలు ఎలా మారిపోయాయో చూడాలనే విధంగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

దీనిపై పెద్ద దుమారం లేచింది. అది పాకిస్తాన్‌కు చెందిన ఫొటో అని తేలింది. ది లండన్ పోస్ట్ పత్రికలో ఆ ఫొటోకు సంబంధించిన కథనం వెలువడింది. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలంటూ ఆ పిల్లల కాళ్ల ఫొటోలను ప్రచురించింది. ఎక్కడో పాకిస్తాన్‌లో పరిస్థితికి అద్దంపట్టే ఫొటోను తీసుకొచ్చి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ నేతపై విరుచుకుపడుతున్నారు కొందరు నెటిజన్లు.అయితే, తాను అ ఫొటో భారత్‌కు చెందినదే అని ఎక్కడా చెప్పలేదంటూ వివరణ ఇచ్చారు అమెరికై వి నారాయణన్. వలస కూలీల పరిస్థితిని చెప్పడానికి సింబాలిక్‌గా వాడానే కానీ, తాను ఎక్కడా అది భారత్‌లో ఫొటో అని చెప్పలేదంటూ మరో ట్వీట్ చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: April 16, 2020, 9:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading