కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా వైరస్ పాజిటివ్..

కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా వైరస్ పాజిటివ్..

ప్రతీకాత్మక చిత్రం

ఓవైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ నివారణకు ప్రయత్నిస్తున్న తరుణంలో రోజురోజూకీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులకు సైతం కరోనా బెడద వీడడం లేదు.

  • Share this:
    దేశంలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వాలు దాదాపు మూడు నెలల పాటు లాక్‌డౌన్ విధించాయి. అనంతరం లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ నివారణకు ప్రయత్నిస్తున్న తరుణంలో రోజురోజూకీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులకు సైతం కరోనా బెడద వీడడం లేదు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలకు, ఎమ్మెల్యేలకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎంపీ, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి సైతం శుక్రవారం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. కరోనా వైరస్ సోకడంతో సింఘ్వి స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాడు.

    అభిషేక్ సింఘ్వి త్వరగా కోలుకోవాలని సుప్రీం కోర్టు న్యాయవాదులు, కాంగ్రెస్ నేతలు కోరారు. ఇదిలావుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటిదాకా 70390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2365 మంది చనిపోయారు. మరో 41437 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలోనూ పలువురు నేతలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
    First published:

    అగ్ర కథనాలు