CONGRESS CHIEF SONIA GANDHI IN A VIDEO MESSAGE PRAISED DOCTORS SANITATION WORKERS POLICEMEN IN THE FIGHT AGAINST CORONAVIRUS BS
ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ప్రజలకు సోనియా గాంధీ కీలక సందేశం..
ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఆమె చేరారు. (Image:Congress/Twitter)
Sonia Gandhi : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న లాక్డౌన్ మరికొద్ది గంటల్లో పూర్తి కాబోతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశాన్ని పంపించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె 5 నిమిషాల 45 సెకన్ల పాటు మాట్లాడారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న లాక్డౌన్ మరికొద్ది గంటల్లో పూర్తి కాబోతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశాన్ని పంపించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె 5 నిమిషాల 45 సెకన్ల పాటు మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు అద్భుతంగా పని చేస్తున్నారు. కరోనాపై దేశం కొనసాగిస్తున్న యుద్ధాన్ని వారంతా ముందుండి నడిపిస్తున్నారు. వాళ్లు ఫ్రంట్ లైన్ వారియర్లు. కరోనా సోకి చావు బతుకులతో ఇబ్బంది పడుతున్న రోగులను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వారి సేవలు అనిర్వచనీయం’ అని సోనియా కొనియాడారు.
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన వేళ.. పోలీసులు, డాక్టర్లు తమ కుటుంబాలను సైతం వదిలి విధి నిర్వహణలో పాల్గొంటున్నారని, అసలైన దేశభక్తిని ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సరిపడ ప్రొటెక్షన్ కిట్స్ అందుబాటులో లేపోయినా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, ప్రజలు భౌతిక దూరం, లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కరోనాపై పోరాటంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తోడుగా ఉంటారని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు.
कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी का देश के नाम संदेश:- कोरोना संकट में डॉक्टर्स, सफाईकर्मियों, पुलिस सहित सरकारी अधिकारियों के डटे रहने से बड़ी "देशभक्ति" कोई नहीं है। हम एकता, अनुशासन और आत्मबल के भाव से कोरोना को परास्त करेंगे। धैर्य एवं संयम के लिए देशवासियों का धन्यवाद। pic.twitter.com/Sl4zkKURTv
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.