కరోనా విజృంభణ... అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

news18-telugu
Updated: April 21, 2020, 2:54 PM IST
కరోనా విజృంభణ... అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లను ఎక్కువ స్టాక్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందిలో ఇప్పటికే 2వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

క్వారంటైన్‌ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుందని వివరించారు. ఆరెంజ్‌ జోన్ల వారిగా మాస్క్‌లును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కరోనా పరీక్షలను నిర్వహించామని అధికారులు సీఎం జగన్ దృష్టికీ తీసుకొచ్చారు. కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించామని, గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో ఉన్నవారిని మిగతా ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Published by: Kishore Akkaladevi
First published: April 21, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading