ఏపీలో ఆ విద్యార్థులంతా పాస్... సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీలోని పాఠశాల విద్యార్థులకు సంబంధించిన పరీక్షలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: March 26, 2020, 2:47 PM IST
ఏపీలో ఆ విద్యార్థులంతా పాస్... సీఎం జగన్ కీలక నిర్ణయం
సీఎం వైఎస్ జగన్
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా విద్యార్థుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై పరిస్థితులకు అనుగూణంగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

నిన్ననే తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరూ పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయినట్టు ప్రకటించారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వల్ల కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పళనిస్వామి చెప్పారు. కొందరు 12వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నట్టు తన దృష్టికి వచ్చిందని... వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఆ తేదీలను త్వరలో ప్రకటిస్తామని సీఎం పళనిస్వామి చెప్పారు. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాట సుమారు 34వేల మంది 12వ తరగతి విద్యార్థులు మంగళవారం రోజు పరీక్షకు హాజరుకాలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మార్చి 27 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా తమిళనాడు సీఎం బాటలోనే ఏపీ సీఎం జగన్ కూడా పయనించారు.


First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు