HOME »NEWS »Corona vilayatandavam »cm pics appealed to ap residents not to come to the border bn

ఎక్కడి వారు అక్కడే ఉండండి.. సరిహద్దుకు రావొద్దు.. సీఎం విజ్ఞప్తి

ఎక్కడి వారు అక్కడే ఉండండి.. సరిహద్దుకు రావొద్దు.. సీఎం విజ్ఞప్తి
8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

వలస కూలీలు వేల సంఖ్యలో ఉన్నారని, వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని, వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వీరికి అన్ని సదుపాయాలు కల్పించడం చాలా కష్టమవుతోందని, అందువల్ల మిగిలిన వారు సహకరించాలని జగన్ కోరారు.

  • Share this:
    ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వాసులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణ చర్యలపై ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకే అనుమతి ఉందన్నారు. ప్రస్తుతం ఇలా వస్తోన్న వలస కూలీలు వేల సంఖ్యలో ఉన్నారని, వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని, వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వీరికి అన్ని సదుపాయాలు కల్పించడం చాలా కష్టమవుతోందని, అందువల్ల మిగిలిన వారు సహకరించాలని జగన్ కోరారు. అనవసరంగా సరిహద్దుల వరకు వచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్పారు. కరోనా విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమమని తెలిపారు.

    ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దాంతోపాటు మీ ఇళ్లలో ఉన్న వయస్సు మళ్లినవారి ఆరోగ్యానికి ముప్పు తెచ్చినవారవుతారని చెప్పారు. ప్రజారోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ చర్యలకు ప్రజల నుంచి సహకారం కావాలని కోరారు. కరోనాపై జరిగే పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని, ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని గుర్తు చేశారు.

    Published by:Narsimha Badhini
    First published:May 03, 2020, 16:07 IST

    टॉप स्टोरीज