CM KCR REQUESTS FARMER TO FARM COTTON IN RAIN SEASON SK
రైతులకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి.. వానాకాలంలో ఈ పంటలే వేయండి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావును ఆదేశించారు.
తెలంగాణ పంటలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలన్న ఉద్దేశంతోనే నియంత్రిత విధానంలో వ్యవసాయాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే తెలంగాణ రైతులు లాభాలు గడిస్తారని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని.. వారు బాగుపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వానకాలంలో మొక్కజొన్న, వరి ఎక్కువగా పండవని.. పత్తి చేను వేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని అన్నారు. వచ్చే వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది వేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇవి పోగా.. 2 లక్షల ఎకరాల్లో కూరగాయాలు, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలలో లక్షా 80వేల ఎకరాల్లో పసుపు, మహమూబాబాద్, డోర్నకల్‌లో 2 లక్షల ఎకరాల్లో మిర్చి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంటలను యథాతధంగా వేసుకోవచ్చని సూచించారు సీఎం కేసీఆర్. మామిడి, బత్తాయి రైతులు ఎవరికి వారు వేసుకోవచ్చుని చెప్పారు. వరి పంట ఇష్టానుసారం వేస్తే రైతు బంధు డబ్బులు రావని.. మీ కోసమే ఇది చేస్తున్నామని స్పష్టం చేశారు కేసీఆర్. తెలంగాణ పంటలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
''ఏయే రకాలు వేయాలో ప్రభుత్వమే చెబుతుంది. వర్షాకాలంలో మొక్కజొన్న బదులు పత్తి, కంది వేసుకోవచ్చు. కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. యాసంగిలో మొక్కజొన్న వేసుకోవచ్చు. తెలంగాణ సోనా బియ్యంకు షుగర్ ఫ్రీ రైస్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. 10 లక్షల ఎకరాల్లో దాన్ని పండించాలి. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తీసుకొస్తాం. అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. రైతుల ఆదాయం పెరగాలి.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.