హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

CM KCR: సీఎం కేసీఆర్ సి.టి. స్కానింగ్.. పరీక్షల తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే...

CM KCR: సీఎం కేసీఆర్ సి.టి. స్కానింగ్.. పరీక్షల తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే...

తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్

సీఎం కేసిఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను కూడా సేకరించారు.

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్య పరీక్షలు చేశారు. సీఎం కేసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో ‌సిటి స్కాన్‌తో పాటు ఇతర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసిఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను కూడా సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు గురువారం రానున్నాయి. సీఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. సీఎం కెసిఆర్ వెంట ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్, ఎంపి జె. సంతోష్ కుమార్. ఇతర కుటుంబ సభ్యులున్నారు.

''సీఎం కేసీఆర్‌కు సీటీ స్కానింగ్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు చేశాం. అంతా సాధారణంగానే ఉంది. ప్రస్తుతం ఆయనలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. ఆక్సీజన్ స్థాయులు కూడా బాగున్నాయి. సీఎం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వరలోనే విధులయ్యే అవకాశముంది.'' అని డాక్టర్ ఎం.వి. రావు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు సీఎం కేసీఆర్. కొన్ని రోజుల పాటు అక్కడే హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు కవిత ఆయన బాగోగులు చూసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్‌కు ఈనెల 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం కేసీఆర్‌లో స్వల్ప లక్షణాలు కనిపించడంతో మొదట ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్ధారించుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అందులోనూ పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు యశోదాలో సిటీ స్కాన్ చేశారు. అంతా నార్మల్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు.


మరోవైపు తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6542 కొత్త కేసులు నమోదయ్యాయి. 2,887 మంది కోలుకోగా.. మరో 20 మంది మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,67,901కి చేరింది. వీరిలో కరోనా నుంచి 3,19,537 మంది కోలుకున్నారు. 1876 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకు కోటి 20 లక్షల 73వేల 90 కరోనా పరీక్షలు చేశారు.

First published:

Tags: CM KCR, Corona cases, Corona Vaccine, Coronavirus, Covid-19, Hyderabad, Telangana