హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Reliance: ఏపీకి రిలయన్స్ సాయం... ముఖేష్ అంబానీకి సీఎం జగన్ థాంక్స్...

Reliance: ఏపీకి రిలయన్స్ సాయం... ముఖేష్ అంబానీకి సీఎం జగన్ థాంక్స్...

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానికీ.. రిలియన్స్ ఫౌండేషన్ కు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న సేవలకు సలామ్ అంటూ ట్వీట్ చేశారు.

ఏపీకి రిలయన్స్ సాయం.. ముఖేష్ అంబానీకి సీఎం జగన్ థాంక్స్...రిలియన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)సేవలకు సలామ్ అంటున్నారు సీఎం జగన్. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా సాయం చేయడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా తెలుగు రాష్ట్రాలకు తమ సేవలను విస్తరించింది. COVID-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతును అందించనుంది. ఇందులో భాగంగా కోవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలను, అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచితంగా ఇంధనం అందిస్తున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుంది. మరోవైపు ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి గుంటూరు రైల్వే స్టేషన్లకు చేరవేసింది.

మీ సేవలకు సలామ్ అంటూ ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం జగన్. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ పై పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు సాయపడుతున్నారంటూ కొనియాడారు.  

రాష్ట్రానికి మీ మద్దతు ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆక్సిజన్ కు డిమాండ్ కూడా తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీ ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ రైళ్లు ఏపీకి రావడం ఊరట కలిగించే విషయం.

సీఎం జగన్ ట్వీట్ పై రిలయన్స్ ఇండస్ట్రీ తరపున ఎంపీ పరిమళ్ నత్వానీ స్పందించారు. కష్టకాలంలో సాయం చేయడం తమ బాధ్యత అన్నారు. దేశం కష్టాల్లో ఉన్న సమయంలో తమకు తోచిన విధంగా సేవ చేస్తూనే ఉంటామన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ పనితీరుపైనా ప్రశంసలు కురిపించారు. కరోనా భయపెడుతున్న వేళ.. సీఎం జగన్ నిబద్ధతతో.. విరామం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పని చేస్తున్న తీరును కొనియాడారు... 

కరోనా కష్టకాలంలో సేవలు చేసేందుకు రిలియన్స్ ముందు ఉంటోంది. ఇప్పటికే 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. దీనికి రిలయన్స్ అండగా నిలిచింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ రవాణాను సులభతరం చేసేందుకుగానూ రిలయన్స్ 32 ఐఎస్ఒ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో కోవిడ్ పై జరుగుతున్న పోరాటంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో రిలయన్స్ ఫౌండేషన్ ముందువరుసలో నిలిచింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Reliance, Reliance Foundation, Reliance Industries

ఉత్తమ కథలు