news18-telugu
Updated: October 13, 2020, 8:29 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా మహమ్మారి ప్రపంచమంతా పెను మార్పులు తీసుకువచ్చింది. ఒకప్పుడు ఎక్కువగా డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రమే వినియోగించే మాస్కులు, శానిటైజర్లు నేడు అందరి జీవితాల్లో భాగమయ్యాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు గుడ్డ మాస్కులను వినియోగిస్తున్నారు. ఒక సారి వాడి పారేయకుండా మళ్లీ, మళ్లీ వాడొచ్చన్న కారణంగా గుడ్డ మాస్కులను అనేక మంది ధరిస్తున్నారు. అయితే చాలా మంది వాటిని తరచుగా శుభ్రం చేసుకోవడం లేదు. వారాల కొద్దీ ఒకే మాస్కును ఉతుక్కోకుండా వాడుతున్నాడు. ఇలా చేస్తే ప్రయోజనం ఉండదని ఓ అధ్యాయనం తెలిపింది. అలా ఉతకని మాస్కులు మనకు కరోనా నుంచి ఏ మాత్రం రక్షణ కల్పించలేవని ఆ అధ్యాయనం స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు తగిన విధంగా వాటిని శుభ్రం చేసుకుంటేనే అవి కరోనా నుంచి మనను కాపాడుతాయని నిపుణులు తేల్చారు.
సరిగ్గా ఉతకని మాస్కులు వాడడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ స్టడీ చెబుతోంది. వినియోగించిన అనంతరం క్లాత్ మాస్కులు, సర్జికల్ మాస్కులు ఈ రెండింటినీ కలుషితమైనవిగానే పరిగణించాలని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రైనా మాక్లింటైర్ అన్నారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు వినియోగించే అవకాశం ఉన్న గుడ్డ మాస్కులను సరిగా శుభ్రం చేయకుండా లేదా హడావుడిగా త్వరగా ఉతికి వాడడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఓ హాస్పటల్ లో హెల్త్ కేర్ సిబ్బంది మాస్కుల వినియోగంపై చేసిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడైందన్నారు. వారు వినియోగించిన మాస్కులను మిషన్ లో, ఉష్టోగ్రత ఉన్న నీటితో ఉతికినప్పుడు మంచిగా పని చేసినట్లు తేలింది. అదే మాస్కులను చేతితో, తక్కువ సమయంలో ఉతికిన సమయంలో సరిగా రక్షణ కల్పించలేవని తేలిందన్నారు. క్లాత్ మాస్కులు పని చేస్తాయని.. వాటిని వాడొచ్చని మాక్లెంటర్ అన్నారు. కానీ వాటిని వాడిన ప్రతీ సారి సరిగ్గా.. తగిన ఉష్టోగ్రత వద్ద శుభ్రం చేస్తేనే ప్రభావవంతంగా పని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని ఆయన సూచించారు.
Published by:
Nikhil Kumar S
First published:
October 13, 2020, 8:19 AM IST