కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సిగరెట్ల కంపెనీ...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తాము వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ఓ సిగరెట్ల కంపెనీ ప్రకటించింది.

news18-telugu
Updated: May 15, 2020, 9:00 PM IST
కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సిగరెట్ల కంపెనీ...
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది. చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు సాధిస్తుండటంతో.. సాధ్యమైనంత తొందరగా కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు అందరిలోనూ కనిపిస్తున్నాయి.
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తాము వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ఓ సిగరెట్ల కంపెనీ ప్రకటించింది. ల్యాబ్ టెస్టుల్లో సత్ఫలితాలను ఇచ్చిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. లండన్ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహించే బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ప్రపంచంలోనే సిగరెట్లు అత్యధికంగా తయారు చేసే కంపెనీల్లో ఈ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ రెండోది. ‘మేం తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ల్యాబ్‌లో విజయవంతం అయింది. అమెరికాలో మనుషుల మీద మొదటి దశ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉంది. ’ అని ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొదింది. జూన్ ఆరంభానికి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని, ఎంత ఖర్చు అయినా భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ పరిపాలన విభాగంతో తాము టచ్‌లో ఉన్నట్టు పేర్కొంది. ప్రపంచంలోని ఇతర ప్రభుత్వ ఏజెన్సీలను కూడా తాము సంప్రదిస్తున్నట్టు తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 15, 2020, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading