హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

‘చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..’

‘చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..’

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘చౌరస్తా’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సరికొత్త పాటతో ప్రజల్లోకి వచ్చారు. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, వీలైనంతలో ఇల్లు దాటి కాలు బయట పెట్టొద్దని తమదైన శైలిలో చెప్పారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వైద్య సిబ్బంది పలు సూచనలు చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని.. వీలైనంతలో సమాజానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెబుతున్నారు. శానిటైజర్లు వాడాలని, దగ్గు, తుమ్ము వచ్చినపుడు మోచేతిని అడ్డంగా పెట్టుకోవాలని అంటున్నారు. అయితే, కొందరు మాటల్లో చెబితే వింటారు.. కొందరు చేతలతోనే వింటారు.. మరికొందరికి పాట రూపంలో చెబితే నెత్తికెక్కుతుంది అనుకున్నారేమో గానీ.. ‘చౌరస్తా’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సరికొత్త పాటతో ప్రజల్లోకి వచ్చారు.

కరోనా నేపథ్యంలో షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, వీలైనంతలో ఇల్లు దాటి కాలు బయట పెట్టొద్దని తమదైన శైలిలో చెప్పారు. దానికి సంబంధించిన పాట, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా, కాళ్లు కూడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా, ఉన్నకాడే ఉండరా.. మంచి రోజులొచ్చెదాక నిమ్మలంగ ఉండరా.. అంటూ పాడిన పాట ఉర్రూతలూగిస్తోంది. బతికుంటే అన్నీ చూసుకోవచ్చన్న అర్థంతో పాటను రాశారు. సమాజం ఆలోచించేలా, సాధారణ జనానికి ఈజీగా అర్థమయ్యేలా రాశారు. ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి..

First published:

Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Youtube

ఉత్తమ కథలు