దండోరా.. చిత్తూరు జిల్లా జౌనిపల్లి వాసులకు తెలియజేయునది ఏమనగా...

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు జిల్లా వీకోట మండలం జౌనిపల్లి పంచాయితీ ఎగువపల్లి గ్రామంలో కరోనా పరంగా ఇప్పుడు దండోరా వేయించారు.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు, తమ గ్రామాలను రక్షించుకునేందుకు రకరకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. అందులో భాగంగానే గ్రామకంఠంలో చాటింపు వేయించి, పల్లెలో దండోరా వేయిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా వీకోట మండలం జౌనిపల్లి పంచాయితీ ఎగువపల్లి గ్రామంలో కరోనా పరంగా ఇప్పుడు దండోరా వేయించారు. గ్రామం నుంచి ఎవరూ వీకోట మండలానికి వెళ్లరాదని, ఎవరూ అక్కడి నుంచి తమ గ్రామంలోకి రాకూడదని చాటింపు వేయించారు. గ్రామ కట్టుబాటును విస్మరిస్తే రూ.2000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బయట గ్రామం వాళ్ళని కూడ లోనికి అనుమతించకూడదని గ్రామస్తులు ముక్తకంఠంతో నిర్ణయించారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వి.కోట మండలానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్టు తెలియడంతో గ్రామస్తులు ఈ మేరకు దండోరా వేయించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: