హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలుగు సినీ కార్మికులకు తోడుగా అమితాబ్.. చిరంజీవి ధన్యవాదాలు..

తెలుగు సినీ కార్మికులకు తోడుగా అమితాబ్.. చిరంజీవి ధన్యవాదాలు..

చిరంజీవి, అమితాబ్  Photo : Twitter

చిరంజీవి, అమితాబ్ Photo : Twitter

కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి.

కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యం రోజూవారి పనులు చేసుకునే కూలీలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కుంటున్నారు. దేశంలో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలెన్నో. దీంతో వారిని ఆదుకునేందుకు రాజకీయ నాయకులనుండి, అంతో ఇంతో సామాజిక సృహ, సమాజం పట్ల సోయి ఉన్న ప్రముఖులు.. ఆర్థికంగా ఓ స్థోమత ఉన్న వారు ఈ కష్ట కాలంలో పేద ప్రజలకు తోడుగా ఇటు డబ్బు రూపంలో గానీ, లేక వస్తువుల రూపంలో కానీ సాయం చేస్తూ ఆపత్కాలంలో తోటివారికి తోడుగా ఉంటున్నారు. అందులో భాగంగా తాజాగా తెలుగు సినీ కార్మికుల కోసం అమితాబ్ 12000 కూపన్స్ విరాళంగా ఇచ్చారు. ఒక్కొక్క కూపన్ విలువ 1500 రూపాయలు కాగా.. వీటిని బిగ్ బజార్‌లో షాపింగ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం కూపన్స్ విలువ దాదాపు 1.8 కోట్ల ఉండనుందని సమాచారం.

ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా పేర్కోంటూ.. చిత్ర పరిశ్రమలన్నీ ఒక కుటుంబంగా భావించి అమితాబ్ ఈ సాయం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా అమితాబ్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు  చిరంజీవి అద్వర్యంలో ఇప్పటికే కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ ఛారిటీకి తమకు తోచిన సాయం చేస్తూ విరాళాలు ప్రకటించారు. ఈ విరాళాలను లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న సినీ కార్మికుల నిత్య అవసరాలకు ఉపయోగిస్తున్నారు చారిటీ నిర్వహకులు.

First published:

Tags: Amitabh bachchan, Chiranjeevi

ఉత్తమ కథలు