హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఉద్దేశ్యపూర్వకంగా కరోనా అంటించుకున్న పాపులర్ సింగర్..కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఉద్దేశ్యపూర్వకంగా కరోనా అంటించుకున్న పాపులర్ సింగర్..కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Image : Instagram

Image : Instagram

Chinese Singer Intentionally Infected Covid 19 : కరోనా వైరస్(Corona virus) పేరు వింటేనే మనం భయపడిపోతాం. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Chinese Singer Intentionally Infected Covid 19 : కరోనా వైరస్(Corona virus) పేరు వింటేనే మనం భయపడిపోతాం. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే 38 ఏళ్ల పాపులర్ చైనీస్ గాయని, పాటల రచయిత జేన్ జాంగ్(Jane Zhang)ఉద్దేశపూర్వకంగా తనకు కరోనావైరస్ సోకేలా చేసుకున్నట్లు తెలిపింది. ఆమె స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. BF.7 ఒమిక్రాన్ వేరియంట్‌తో చైనాలో కేసులలో భారీగా పెరుగుతున్న సమయంలో ఆమె ఉద్దేశ్యపూర్వకంగా కరోనాబారిన పడటం తీవ్ర విమర్శలపాలు చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన స్నేహితులను ఉద్దేశపూర్వకంగా చూడటం ద్వారా తనకు కరోనావైరస్ సోకినట్లు జేన్ జాంగ్ సోషల్ మీడియాలో అంగీకరించింది. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని ఆమె వెల్లడించింది. రాబోయే నూతన సంవత్సర వేడుకల కచేరీకి సన్నద్దమ్యే ప్రక్రియలో భాగంగానే వైరస్‌ అంటుకునేలా చేసుకున్నానని, ఇప్పుడే వైరస్ సోకి కోలుకోవడం ద్వారా న్యూఇయర్ ఈవెంట్ లో మళ్లీ వైరస్ సోకే ప్రమాదం ఉండదని భావించినట్లు తెలిపింది.

న్యూఇయర్ ఈవెంట్ లో తన ఆరోగ్యం దెబ్బతింటే అది తన ప్రదర్శనపై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన చెందానని,అందుకే కోవిడ్ సోకిన వారితో కలిశానని,ఇప్పుడు కోలుకునేందుకు తగిన సమయం ఉందని జేన్ జాంగ్ సోషల్ మీడియాలో తెలిపింది. తనకు ఒక రోజు మాత్రమే కోవిడ్ లక్షణాలు జ్వరం, గొంతు నొప్పి,బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు కనిపించాయని,తర్వాత మామూలుగానే ఉందని జాంగ్ వివరించారు. ఒక పగలు, రాత్రి పడుకున్న తర్వాత తన కోవిడ్ లక్షణాలన్నీ మాయమయ్యాయని తెలిపింది. కోలుకోవడానికి ముందు ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా తాను ఎక్కువగా నీరు తాగానని, విటమిన్ సి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

Covid Again : కథ మళ్లీ మొదటికి..విమానాశ్రయాల్లో మళ్లీ కరోనా టెస్ట్ లు ప్రారంభం!

సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ వైరల్ అయినప్పటి నుండి చాలా మంది ఆమె బాధ్యతారహితమైన ప్రవర్తనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా చైనా కోవిడ్ -19 ఉప్పెనను ఎదుర్కొంటున్న సమయంలో ఆమె చర్యలు మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని నెటిజన్లు విమర్శిస్తున్న క్రమంలో జేన్ జాంగ్.. సోషల్ మీడియా నుండి వివాదాస్పద పోస్ట్‌ను తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పింది.

First published:

Tags: China, Corona, Covid

ఉత్తమ కథలు