Coronavirus: కరోనావైరస్ భారత్‌లోనే పుట్టింది.. చైనా శాస్త్రవేత్తల కొత్త రచ్చ

coronavirus: చైనా ముందు నుంచీ ఇలాగే వ్యవహరిస్తోంది. గతంలో ఇటలీ, అమెరికా, యూరప్‌పై ఆరోపణలు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే పక్క దేశాలపై దుమ్మెత్తిస్తోంది. ఇప్పుడు ఇండియా వైపు వేలెత్తి చూపుతోంది

news18-telugu
Updated: November 28, 2020, 10:25 PM IST
Coronavirus: కరోనావైరస్ భారత్‌లోనే పుట్టింది.. చైనా శాస్త్రవేత్తల కొత్త రచ్చ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏడాది కాలంగా ప్రపంచం వణికిపోతోంది. కరోనా వైరస్‌తో విలవిల్లాడుతోంది. గత ఏడాది నవంబరు 17న చైనాలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. వూహాన్ సిటీలో కరోనా మహమ్మారి పుట్టిన విషయం తెలిసిందే. యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసు. వూహాన్‌లో కరోనా వైరస్ పుట్టినా.. మిగతా ప్రపంచాన్ని అప్రమత్తంగా చేయకుండా.. ఇంతటి అల్లకల్లోలానికి కారణమైందని ముందు నుంచీ చైనాపై పలు దేశాలు మండిపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా పదే పదే ఈ విషయంలో చెనాపై నిప్పులు చెరిగారు. కరోనాను చైనీస్ వైరస్‌గా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా యావత్ ప్రపంచం.. చైనా వైపు వేలెత్తిచూపిస్తున్నా.. డ్రాగన్ మాత్రం వితండ వాదం చేస్తోంది. తమకూ కరోనా వైరస్‌తో సంబంధమే లేదని బుకాస్తోంది. ఈ క్రమంలో కొత్త వాదనను ఎత్తుకున్న చైనా.. భారత్‌పై విషం చిమ్ముతోంది.

కరోనా వైరస్ భారత్‌లోనే పుట్టిందని చైనా శాస్త్రవేత్తలు మరో సంచలనానికి తెరదీశారు. కరోనాను అడ్డంపెట్టుకొని ఇండియాపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేశారు. గత ఏడాది వేసవిలో ఈ వైరస్ పుట్టిందని పేర్కొన్నారు. జంతువుల నుంచి కలుషిత నీటి ద్వారా మనుషులకు సంక్రమించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వుహాన్‌కు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. వుహాన్‌లో తొలి కేసు బయటపడడంతో.. అక్కడే వైరస్ పుట్టినట్లు అందరూ అపోహ పడుతున్నారని వెల్లడించారు. భారత్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే చాలా రోజుల పాటు కరోనావైరస్‌ను గుర్తించలేకపోయారని నిందలు వేశారు చైనీస్ శాస్త్రవేత్తలు.

చైనా ముందు నుంచీ ఇలాగే వ్యవహరిస్తోంది. గతంలో ఇటలీ, అమెరికా, యూరప్‌పై ఆరోపణలు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే పక్క దేశాలపై దుమ్మెత్తిస్తోంది. ఇప్పుడు ఇండియా వైపు వేలెత్తి చూపుతోంది డ్రాగన్. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవల నేపథ్యంలో.. భారత్‌పై చైనా ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయింది. ఐతే భారత్‌తో పాటు బంగ్లాదేశ్, గ్రీస్, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, రష్యా, సెర్బియాపైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ వేరెక్కడో పుట్టింది తప్ప.. చైనాలో మాత్రం పుట్టలేదని స్పష్టం చేస్తోంది. అసలా వైరస్‌కు చైనాకు సంబంధమే లేదని చెబుతోంది. ఇతర దేశాల్లాగే తామూ బాధితులమని మొసలి కన్నీరు కారుస్తోంది. చైనా తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, ఇండియాలో గడిచిన 24 గంటల్లో 41,322 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 93,51,109కి చేరింది. అలాగే... నిన్న 485 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 87,59,969కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగానే కొనసాగుతోంది. ఇండియాలో నిన్న 41,452 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 87,59,969కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు ఇండియాలో 93.7 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,54,940గా ఉన్నాయి. నిన్న ఇండియాలో 11,57,605 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 13,82,20,354కి చేరింది.
Published by: Shiva Kumar Addula
First published: November 28, 2020, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading