కరోనా వైరస్ ల్యాబ్‌లో తయారైంది కాదు.. సహజంగా వచ్చిందే..

చైనాలోని షాన్ డాంగ్ ఫస్ట్ మెడికల్ వర్సిటీ శాస్ర్తవేత్తలు మాత్రం కరోనా వైరస్ సహజంగా ఏర్పడిన వైరస్ అని ఘంటాపథంగా చెబుతున్నారు. యునాన్ ప్రావిన్స్‌లోని 227 గబ్బిలాల నుంచి శాంపిళ్లుసేకరించి విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.

news18-telugu
Updated: May 13, 2020, 6:16 AM IST
కరోనా వైరస్ ల్యాబ్‌లో తయారైంది కాదు.. సహజంగా వచ్చిందే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌ను ల్యాబ్‌ల్లో తయారు చేశారని, కావాలనే దాన్ని జనాలపైకి వదిలారనే ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై కొంతమంది మేధావులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చైనాలోని షాన్ డాంగ్ ఫస్ట్ మెడికల్ వర్సిటీ శాస్ర్తవేత్తలు మాత్రం కరోనా వైరస్ సహజంగా ఏర్పడిన వైరస్ అని ఘంటాపథంగా చెబుతున్నారు. యునాన్ ప్రావిన్స్‌లోని 227 గబ్బిలాల నుంచి శాంపిళ్లుసేకరించి విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. మలయన్ హార్స్‌షూ జాతికి చెందిన గబ్బిలాల్లో గుర్తించిన ‘ఆర్ఎంవైఎన్02’ వైరస్ స్పైక్ ప్రోటీన్లలోని ఎస్1, ఎస్2 సబ్ యూినట్లలో ఉండే అమైనో యాసిడ్ల పొందిక.. అచ్చం కరోనా వైరస్‌ను పోలేలా ఉందని తెలిపారు. అంతమాత్రాన ఆ రెండు వైరస్‌లూ ఒకే వర్గానికి చెందినవని చెప్పలేని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌లో జన్యువులు, స్పైక్ ప్రొటీన్ల నిర్మాణంలో జరిగిన సహజ మార్పులకు ఇది ఒక ఉదాహరణగా చెప్పారు. ల్యాబ్‌లో కరోనా పుట్టలేదనేందుకు ఇది ఒక నిదర్శమని వివరించారు.
Published by: Narsimha Badhini
First published: May 13, 2020, 6:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading