హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

China: చైనాను వదలని కరోనా..జూన్‌లో వారానికి 6.5 కోట్లకు చేరనున్న కేసులు?

China: చైనాను వదలని కరోనా..జూన్‌లో వారానికి 6.5 కోట్లకు చేరనున్న కేసులు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ను నియంత్రించడంలో చైనా విజయం సాధించినప్పటికీ, కఠినమైన ‘జీరో కోవిడ్’ విధానాన్ని వదిలేసింది. దీని పరిణామాలు భయంకరంగా ఉండవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

China: కరోనా సమయంలో కుదేలైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అమెరికా తర్వాత అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా(China) పరిస్థితి కూడా అంతే. కానీ ఇప్పుడు చైనాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. తాజాగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులపై(Covid cases) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ను నియంత్రించడంలో చైనా విజయం సాధించినప్పటికీ, కఠినమైన ‘జీరో కోవిడ్’ విధానాన్ని వదిలేసింది. దీని పరిణామాలు భయంకరంగా ఉండవచ్చు. జూన్ చివరి నాటికి కోవిడ్-19 కేసులు వారానికి 6.5 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

ప్రఖ్యాత శ్వాసకోశ వ్యాధుల నిపుణులు జాంగ్ నాన్షాన్ చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఒక సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొత్త XBB ఒమిక్రాన్‌ వేరియంట్ ఆవిర్భావంతో ప్రస్తుత ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. దీని కారణంగా ఏప్రిల్ చివరి నుంచి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని స్పష్టం చేశారు.

* మే నెలాఖరుకు వారానికి 4కోట్ల కేసులు

చైనాలో కోవిడ్-19 కేసులు మే నెలలో వారానికి దాదాపు 40 మిలియన్లకు పెరుగుతాయని, జూన్‌ చివరికి వారానికి 65 మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకుంటుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఉప్పెనను ఎదుర్కొనేందుకు, XBB వేరియంట్‌ను అడ్డుకునేందుకు కొత్త వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడంపై చైనా దృష్టి సారించింది. జాంగ్ నాన్షాన్ యొక్క ప్రిడిక్షన్ మోడల్ చైనాలో కొత్త కోవిడ్-19 వేవ్ గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ప్రత్యేకించి ఆరు నెలల క్రితం చైనా ‘జీరో కోవిడ్’ పాలసీని రద్దు చేసింది. వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో రూపొందించిన ఈ పాలసీలో కఠినమైన లాక్‌డౌన్‌లు, ప్రయాణ పరిమితులు, కఠినమైన పరీక్షలు, నిర్బంధ చర్యలు ఉన్నాయి.

చైనా CDC వీక్లీ పాండమిక్ నివేదిక Covid-19 కేసులు వరుసగా రెండు వారాల పాటు ఇన్ఫ్లుఎంజా కేసులను అధిగమించాయని, దేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న వ్యాధిగా అగ్రస్థానాన్ని పొందాయని వెల్లడించింది. బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ వంటి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులు ఇప్పటికే పొడవైన క్యూలు, రద్దీని ఎదుర్కొంటున్నాయి. ఇది గత సంవత్సరం చివరి నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు సంభవించిన మునుపటి వేవ్‌ను గుర్తు చేస్తోంది.

తేల్చేసిన డాక్టర్.. 5 రూపాయల పండులో క్యాన్సర్ ను నిరోధించే కారకం.. అదేంటో తెలుసా..?

* వణికిస్తున్న కొత్త వేరియంట్‌?

కోవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ‘జీరో కోవిడ్’ విధానాన్ని వదలివేయాలనే నిర్ణయం జనాభాను అధిక ప్రమాదానికి గురిచేసింది. XBB Omicron వేరియంట్ ఆవిర్భావం పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున, వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అధికారులు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం. ఈ కొత్త వేవ్ ప్రభావంతో చైనా సతమతమవుతున్నందున రాబోయే వారాలు సవాలుగా మారనున్నాయి. ఆరోగ్య సంక్షోభాన్ని మేనేజ్‌ చేయడం, ఆర్థిక పరిణామాలను తగ్గించడం మధ్య సమతుల్యతను సాధించడానికి దేశం ప్రయత్నించాలి. వ్యాక్సిన్‌ తయారీని ప్రోత్సహించాలి.

First published:

Tags: China, Corona casess, Corona virus, Covid19

ఉత్తమ కథలు