కరోనా విచారణకు చైనా ఓకే... కానీ ఓ కండిషన్..

కరోనా విచారణకు చైనా ఓకే... కానీ ఓ కండిషన్..

ప్రతీకాత్మక చిత్రం

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో బహిరంగంగా, అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా పరిశీలన జరగాలని చైనా కోరుకుంటోంది.’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు.

  • Share this:
    కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో ఉన్న మాసం మార్కెట్ నుంచి వచ్చిందా? లేకపోతే చైనాలోని ల్యాబ్‌లో సృష్టించి ప్రపంచం మీదకు వదిలారా? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలో లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, ప్రపంచ దేశాల ఒత్తిడి నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వైరస్ మూలాలను కనిపెట్టేందుకు చైనా పూర్తిగా సహకరిస్తుందని తెలిపింది. అయితే, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ సారధ్యంలో జరగాలని కండిషన్ పెట్టింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో బహిరంగంగా, అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా పరిశీలన జరగాలని చైనా కోరుకుంటోంది.’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. అది కూడా కరోనా వైరస్ పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమేనని స్పష్టం చేసింది.

    చైనాలోని ఓ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, ఆ ఆరోపణలను చైనా కొట్టేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. అందులో 2.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 13.70 లక్షల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అమెరికాలో సుమారు 13 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా, చైనాలో 82 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఈరోజు చైనాలో కేవలం ఒకే ఒక్క కొత్త కేసు నమోదైనట్టు ఆ దేశం ప్రకటించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: