Home /News /coronavirus-latest-news /

CHINA SHUTS TECH HUB SHENZHEN OVER 66 COVID CASES AS COVID CASES SPIKE 17 MILLION PEOPLE IN LOCKDOWN PVN

Lockdown In China : కరోనా విజృంభణ..చైనాలోని మరో నగరంలో లాక్ డౌన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chna Shuts Another City Over Rising Covid Cases : కొవిడ్‌ కేసుల నేపథ్యంలో ఇప్పటికే షాంఘైలో పాఠశాలు,పార్క్‌ లను మూసివేసిన చైనా మరికొన్ని నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌ చున్‌ లో శుక్రవారం లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న యాంజిని నగరాన్ని.. పూర్తిగా దిగ్బంధించారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్‌ డాంగ్ ప్రావిన్స్‌ లోని యుచెంగ్‌ లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు జారీ చేశారు.

ఇంకా చదవండి ...
China Shuts Tech Hub Shenzhen :  చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కొవిడ్‌ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. 2020 మార్చి తర్వాత రోజువారీ అత్యధిక కేసులు గత కొద్ది రోజులుగా నమోదవుతున్నాయి. చైనాలో క‌రోనా కొత్త వేరియంట్ ప్ర‌స్తుతం పంజా విసురుతోన్న నేపథ్యంలో ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వివిధ నగరాల్లో రోజుకు వెయ్యి కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2019 డిసెంబర్ లో తొలిసారి కరోనా వైరస్‌ చైనాలో వెలుగుచూసింది. దీంతో చైనా ప్రభుత్వం మహమ్మారి కట్టడికి కఠినచర్యలు చేపట్టింది. ఆంక్షలు, లాక్‌డౌన్లతో యావత్తు దేశాన్ని కొన్నివారాలపాటు బంద్‌ పెట్టింది. కఠినఆంక్షల ద్వారా అప్పట్లో మహమ్మారిని అదుపుచేసిన చైనా.. ఇప్పుడు కూడా అదేవిధమైన చర్యలు తీసుకుంటోంది.

ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠం. రెండేళ్ల తర్వాత గరిష్ఠస్థాయిలో కొత్త కేసులు నమోదైన వేళ జిన్ పింగ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించిన చైనా.. వాటిని మరింత విస్తరిస్తోంది. దక్షిణ చైనాలోని టెక్ హబ్ గా పిలువబడే షెన్‌ జెన్‌ లో ఒకే రోజు 66 మందికి వైరస్‌ సోకడంతో స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. షెన్‌ జెన్‌ లో ...జిన్‌ పింగ్ ప్రభుత్వం సోమవారం కఠినమైన లాక్‌ డౌన్‌ ను విధించింది. ఈ నగరం హంకాంగ్‌ తో సరిహద్దు కలిగి ఉంది. అక్కడ కేసులు అధికంగా ఉండడం వల్ల షెన్‌ జెన్‌లోని 1 కోటి 75 లక్షల మందిని ఇంళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీచేశారు. ఈ ఆంక్షలు ఈనెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు. హువావే, టెన్‌ సెంట్‌ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌ జెన్‌ లోనే ఉన్నాయి.

ALSO READ U.S Consulate : అమెరికా కాన్సులేట్ పై 12 మిసైల్స్ తో దాడి

కొవిడ్‌ కేసుల నేపథ్యంలో ఇప్పటికే షాంఘైలో పాఠశాలు,పార్క్‌ లను మూసివేసిన చైనా మరికొన్ని నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌ చున్‌ లో శుక్రవారం లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న యాంజిని నగరాన్ని.. పూర్తిగా దిగ్బంధించారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్‌ డాంగ్ ప్రావిన్స్‌ లోని యుచెంగ్‌ లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు జారీ చేశారు. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. మహమ్మారిని ప్రస్తుతం అదుపు చేయకపోతే.. వైరస్ సామాజికవ్యాప్తి దశకు చేరే ప్రమాదం ఉందని చైనా వైద్య శాఖ అధికారులు హెచ్చరించారు. అందువల్ల.. ప్రజలు ఇళ్లలో ఉంటూ వైరస్‌ నియంత్రణకు సహకరించాలని కోరుతున్నారు. మధ్యలో మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆరోగ్య వ్యవస్థలు నిర్లక్ష్యంగా మారటం కూడా వైరస్‌ విజృంభణకు ఓ కారణమని అధికారులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Covid 19 restrictions, Covid cases, Lockdown

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు