Home /News /coronavirus-latest-news /

CHINA REPORTS 2 COVID DEATHS IN MORE THAN A YEAR PVN

COVID-19 : చైనాలో కరోనా మరణ మృదంగం..ఏడాది తర్వాత మళ్లీ

 (credit - NIAID)

(credit - NIAID)

Covid Deaths In China : చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలకాలని డ్రాగన్‌ భావిస్తున్నట్లు  వస్తున్న   వార్తలను చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ఇంతవరకు అనుసరిస్తున్న జీరో కొవిడ్‌(కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకూడదన్న) విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని నెమ్మదిగా సడలించాలని నిపుణులు సూచించినా సాధ్యం కాదని శుక్రవారం చైనా ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఇంకా చదవండి ...
Covid Deaths In China : కోవిడ్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మల్లీ అలజడి రేగింది. పలు దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్​ దడపుట్టిస్తోంది. గత కొన్ని వారాలుగా చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. చైనా మొత్తం 1.4 బిలియన్ల జనాభాలో 90 శాతం మందికి పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ జరగగా... మూడో వంతు మంది బూస్టర్ డోస్‌ లు వేసుకున్నారు. అయినా సరే స్టెల్త్ ఒమిక్రాన్ వ్యాప్తి ప్రబలంగా ఉంది. చైనాలో గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజువారీ పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అయితే కోవిడ్-19 మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనా మరింత కలవరానికి గురవుతోంది. కరోనా విజృంభణతో ఇప్పటికే చైనాలో 4 కోట్ల మంది లాక్‌డౌన్‌లోకి వెళ్లారు. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇక, ఏడాది తర్వాత చైనాలో మళ్లీ మరణాలు నమోదయ్యాయి. జిలిన్ ప్రావిన్సులో శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయినట్టు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు. 2021 జనవరి తర్వాత ఈ దేశంలో వైరస్‌ మరణాలు సంభవించడం మళ్లీ ఇప్పుడే. కోవిడ్-19 మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనా మరింత కలవరానికి గురవుతోంది. 2019లో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చైనాలో 4,638 మంది వైరస్‌తో మృతిచెందినట్లు చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇక శనివారం చైనాలో 4,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, చైనాలో కోవిడ్‌ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దేశం తయారు చేసిన వ్యాక్సిన్లు సమర్ధత తక్కువగా ఉందని, మిగతా టీకాల్లో ప్రభావవంతగా పని చేయట్లేదని వెల్లడించారు.

ALSO READ Heart Land Virus: అమెరికాలో కొత్తరకం వైరస్ హార్ట్ ల్యాండ్ కలకలం.. జార్జియాతో పాటు 5 రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి

మరోవైపు చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలకాలని డ్రాగన్‌ భావిస్తున్నట్లు  వస్తున్న   వార్తలను చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ఇంతవరకు అనుసరిస్తున్న జీరో కొవిడ్‌(కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకూడదన్న) విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని నెమ్మదిగా సడలించాలని నిపుణులు సూచించినా సాధ్యం కాదని శుక్రవారం చైనా ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించడానికే కట్టుబడి ఉన్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఉప మంత్రి వాంగ్‌ హెషెంగ్‌ స్పష్టం చేశారు. జీరో కొవిడ్‌ విధానం వల్ల ప్రజల జీవితం, వృత్తి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడినా వారి ఆరోగ్యాలను, భద్రతను కాపాడటానికి ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Corona deaths, Coronavirus, Covid -19 pandemic, Covid-19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు