China: భారత్‌లో రోజుకు 3 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు.. చైనాలో రోజుకెన్నో తెలుసా..!

ప్రతీకాత్మక చిత్రం

ఇకపై తమ దేశ ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవద్దని ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం. ఆ దేశ ప్రజలంతా...

  • Share this:
    న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో రోజురోజుకూ తీవ్రత పెంచుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్న పరిస్థితి. భారత్‌లో పరిస్థితి ఇలా ఉండగా.. కరోనాకు పుట్టినిల్లుగా చెప్పుకున్న చైనాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చైనాలో ఏప్రిల్ 25న 11 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఏప్రిల్ 24న 13 కేసులు నమోదయినట్లు ఆ దేశ హెల్త్ అథారిటీ ప్రకటించింది. అంతేకాదు.. కొత్తగా వైరస్ సోకిన బాధితులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారేనని తెలిపింది. చైనాలో కొన్ని రోజులుగా ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. చైనాలో మొత్తం 90,575 మంది ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డారు. వీరిలో.. 85,634 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చైనాలో కరోనా కారణంగా 4,636 మంది చనిపోయారు. ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా కరోనాకు భయపడి.. కట్టడి చర్యల్లో భాగంగా బయటకు వచ్చిన సందర్భంలో మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేస్తుంటే.. ఇజ్రాయెల్ మాత్రం ఆ దేశ ప్రజలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇకపై తమ దేశ ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవద్దని ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం. ఆ దేశ ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో.. బయటకు వెళ్లిన సందర్భంలో మాస్క్ ధరించాల్సిందేనన్న నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్లు ఏప్రిల్ 18న ఇజ్రాయెల్ ప్రకటించింది. 2019 గణాంకాల ప్రకారం.. ఇజ్రాయెల్ జనాభా 90.5 లక్షలు.

    కరోనాను పూర్తి స్థాయిలో జయించిన ఇజ్రాయెల్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. సరిగ్గా కొన్ని నెలల క్రితం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. గతేడాది కరోనా విజృంభణ కారణంగా ఇజ్రాయెల్‌లో 8,36,000 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో.. 6300 మంది కరోనా కారణంగా చనిపోయారు.

    ఇదిలా ఉంటే.. కరోనా కల్లోలం వేళ భారత్‌కు బాసటగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. చైనా కూడా భారత్‌కు ఈ ఉపద్రవం వేళ ఉపకారం చేసేందుకు ముందుకొచ్చింది. దాయాది దేశం పాకిస్తాన్ కూడా భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌కు చెందిన చారిటీ గ్రూప్ అబ్దుల్ ఈదీ ఫౌండేషన్ భారత్‌కు 50 అంబులెన్స్‌లతో పాటు అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బందిని పంపేందుకు సిద్ధమని ప్రకటించింది.
    Published by:Sambasiva Reddy
    First published: