Coronavirus: కరోనా వస్తుందని 2013లోనే చెప్పాడు.. ఈ బాబాకు ఫుల్ డిమాండ్.. ఇప్పుడు ఎక్కడ?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా అనే పదం ప్రపంచానికి పరిచయమైందే 2019లో. అలాంటిది 2013లోనే ఈ పేరుతో వైరస్ వస్తుందని ఎలా చెప్పగలిగాడంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

  • Share this:
చైనాలోని వూహాన్‌లో పుట్టి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను 2013లోనే ఊహించాడు ఒక వ్యక్తి. ‘కరోనా వైరస్... ఇట్స్ కమింగ్’ అంటూ ఏడేళ్ల క్రితం మార్క్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ గురించి 2013లోనే అతడు ఎలా చెప్పగలిగాడనే చర్చ జరుగుతోంది. 2013 జూన్ 3న మార్క్ అనే వ్యక్తి త‌న ట్విట‌ర్ ఖాతాలో ‘క‌రోనా వైర‌స్.. ఇట్స్ క‌మింగ్’ అంటూ చేసిన పోస్ట్‌ అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది. వైర‌ల్ అవుతున్న ఈ ట్విట్ సోష‌ల్ మీడియాతో పాటుగా ప్రపంచ దేశాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. 'కరోనావైరస్' అనే పదం క్షీరదాలు, పక్షులలో వ్యాధులకు కారణమయ్యే RNA వైరస్ సమూహాన్ని సూచిస్తుందని తెలిసిందే. అయితే అసలు కరోనా అనే పదం ప్రపంచానికి పరిచయమైందే 2019లో. అలాంటిది 2013లోనే ఈ పేరుతో వైరస్ వస్తుందని ఎలా చెప్పగలిగాడంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ట్వీట్‌ ఇలా వైరల్ కావడం ఇది మొదటిసారేమీ కాదు. కరోనా ఫస్ట్ వేస్ సమయంలో ఇది తెగ వైరల్ అయి చర్చకు దారి తీసింది. ఇప్పుడు భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మళ్లీ నెటిజన్లు ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. తమ భవిష్యత్తులో జరగబోయేది చెప్పాలంటూ మార్క్‌ను వేడుకొంటున్నారు. అతన్ని ‘ప్రిడిక్షన్ బాబా’ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. నేను నీట్ పరీక్ష క్లియర్ చేస్తానా? నాకు పెళ్లెప్పుడు జరుగుతుంది? దేశానికి కాబోయే ప్రధాని ఎవరు? కోవిన్‌లో స్లాట్ బుక్ అవుతుందా? అంటూ ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.




ఏడేళ్ల క్రితమే ఎలా ఊహించాడు?
ఏడేళ్ల క్రితం మార్క్ చేసిన ట్వీట్‌కు.. కొంద‌రు నెటిజ‌న్లు న‌మ్మలేక‌పోతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం నువ్వు ట్విట్వర్‌ని హ్యాక్ చేసి డేట్ మార్చావా?..అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే 2016 డిసెంబ‌ర్ 16న సోష‌ల్ మీడియాలో మార్క్ చివ‌రిసారి ట్వీట్ చేశారు. ఆ త‌ర్వాత అత‌డు ఆచూకీ లేకుండా పోయారు. అప్పటి నుంచి మ‌ళ్లీ త‌న ట్వీట్లు ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌న్హారం. అస‌లు మార్క్ అనే వ్యక్తి ఏవ‌రు..? అత‌డి ఆచూకీ ఏమైంది..? అనేది ఎవ‌రికీ అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఐతే కరోనా వైరస్‌లలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోన్న వైరస్ SARS-CoV-2, గతంలో ఒకరకమైన కరోనా వైరస్ వచ్చింది. దానికి సంబంధించే మార్క్ ట్వీట్ చేసి ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published: