China Lockdown : కరోనావైరస్(Covid 19) కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా(China)లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా కోవిడ్ కేసులు(Covid Cases) మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో(Chengdu) కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 కోట్లకు పైగా జనాభా కలిగిన చెంగ్డు సిటీలో లాక్ డౌన్(Lockdown In Chengdu) విధిస్తున్నట్లు స్థానిక అధికారులు గురువారం (సెప్టెంబర్ 1,2022) తెలిపారు. సోమవారం నుండి బుధవారం వరకు సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province) లో 492 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య అధికారులు నివేదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
"కనిపించని భారీ వ్యాప్తి,చెల్లాచెదురుగా ఉన్న కేసులు, అనేక రకాల ప్రమాద ప్రదేశాలతో ఈ సారి మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంది. మొత్తం సిటీలో అంటువ్యాధి పరిస్థితి చాలా క్లిష్టంగా, తీవ్రంగా ఉంది" అని గురువారం విలేకరుల సమావేశంలో సిటీ హెల్త్ కమిషన్ డైరక్టర్ యాంగ్ జియావోగువాంగ్ తెలిపారు. చెంగ్డు సిటీలో సెప్టెంబరు 1-4 మధ్య నగరంలో అనేక రౌండ్ల PCR పరీక్షలు జరుగుతాయి, నివాసితులు గురువారం ఉదయం 10 గంటల నుండి తమ ఇళ్లను విడిచి బయటకు వెళ్లవద్దని కోరారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే రోజువారీ సరుకుల కోసం బయటకు వెళ్లవచ్చని, 24 గంటల్లోగా నెగెటివ్ PCR పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని, అత్యవసర అవసరం లేకుండా పౌరులు నగరాన్ని విడిచిపెట్టకూడదని అధికారులు తెలిపారు.
Lingayat Seer Arrest : స్కూల్ పిల్లలపై అత్యాచారం..ప్రముఖ స్వామీజీ శివమూర్తి అరెస్ట్!
నగరంలో కేవలం సూపర్ మార్కెట్లు, రైతుబజారులు, ఫార్మసీలు, వైద్య సదుపాయాలు, ఫుడ్ డెలివరీ సేవలు, క్యాటరింగ్ వ్యాపారాలు మాత్రమే కార్యకలాపాలు కొనసాగించవచ్చని అధికారులు తెలిపారు. అదేవిధంగా,చెంగ్డూకు వచ్చే వ్యక్తులు ప్రవేశద్వారం వద్ద అవసరమైన యాంటీ-ఎపిడెమియోలాజికల్ కంట్రోల్ లో పాస్ అవ్వాల్సి ఉంటుందని, నగరంలో ప్రజా రవాణాను(Public Transport)ఉపయోగించడానికి నెగిటివ్ PCR టెస్ట్ సర్టిఫికెట్ ను సమర్పించాలని తెలిపారు. కాగా, చైనాలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి 60 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా...24,806 కరోనా సంబంధిత మరణాలు సంభవించాయి.
ఇక,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 590,784 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,751 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసులు 607,922,595కు చేరుకోగా,మరణాల సంఖ్య 6,498,279కి చేరుకుంద. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 584,827,732కు చేరింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona cases, Covid -19 pandemic, Lockdown