CHINA IMPOSES LOCKDOWN IN CHANGCHUN AMID NEW COVID OUTBREAK PVN
Lockdown In China : కరోనా కొత్త వేరియంట్ విజృంభణ..చైనాలో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్
జిన్ పింగ్(ఫైల్ ఫొటో)
New Covid Variant : చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. 2020 మార్చి తర్వాత రోజువారీ అత్యధిక కేసులు గత కొద్ది రోజులుగా నమోదవుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ ప్రస్తుతం పంజా విసురుతోన్న నేపథ్యంలో ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. 2020 మార్చి తర్వాత రోజువారీ అత్యధిక కేసులు గత కొద్ది రోజులుగా నమోదవుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ ప్రస్తుతం పంజా విసురుతోన్న నేపథ్యంలో ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వివిధ నగరాల్లో రోజుకు వెయ్యి కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. 90 లక్షల మంది జనాభాను కలిగిన జిలిన్ ప్రావిన్స్ లోని పారిశ్రామిక నగరం చాంగ్ చున్ లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాంగ్ చున్ లో చైనా ప్రభుత్వం శుక్రవారం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేసింది. చాంగ్ చున్ లో టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ప్రకటించింది.
ఈ నగరంలోని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని,నగరంలోని ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా పరీక్ష చేయించుకోవాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. మూడు రౌండ్ల కరోనా పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవాలని అధికారులు సూచించారు. చాంగ్ చున్ నగరం నుంచి అన్ని రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. వైద్యం తప్ప అన్ని వ్యాపార సంస్థలకూ సెలవులు ఇచ్చేశారు. స్కూల్స్ మూసివేశారు. రెండు రోజులకు ఒకసారి నిత్యావసరాల కొనుగోలుకు బయటకు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. చాంగ్ చున్ లో టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ప్రకటించింది.
ALSO READ Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏజ్ ఎంతో తెలుసా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
చాంగ్ చున్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జిలిన్ ప్రావిన్స్ నగరాల్లో కూడా కోవిడ్ కేసులు భారీగా వెలుగుచూశాయి. జిలిన్ నగరంలో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ, ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటికే నగరంలో పాక్షిక లాక్డౌన్ను ఆదేశించారు. ఇతర నగరాలతో రాకపోకలు నిలిపివేయబడ్డాయి. గ్వాంగ్ డాంగ్, షాన్ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితికి తగ్గట్లుగా అధికారులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇక, శుక్రవారం చైనా వ్యాప్తంగా 397 కొత్త రకం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో 98 కేసులు జిలిన్ ప్రావిన్స్ లో వెలుగుచూశాయి
కాగా, కరోనా వైరస్ నుంచి ఎలాగోలా బయటపడిపోయామంటూ ఊపిరి పీల్చుకుంటున్న దేశాలు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభణ,లాక్ డౌన్ వార్తలో మళ్లీ ఆందోళనకు గురవుతున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.