Covid cases in china : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్(Covid19) కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా(China)లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం చైనాలో కొత్తగా 31,454 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. అయితే కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి చైనాలో ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి అని తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది.
వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో కరోనా టెస్ట్ లు, ప్రయాణ పరిమితులు, లాక్ డౌన్ లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.
Business News: లక్షల్లో తగ్గిన టెలికాం వినియోగదారుల సంఖ్య .. డిటెయిల్స్ ఇవిగో
చైనాలోని యాపిల్‌కు చెందిన ఐఫోన్ ప్లాంట్‌లో ఆందోళనలు చెలరేగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తీవ్ర అసంతృప్తికి గురైన ఉద్యోగులు బుధవారం ఉదయం పోరాటానికి దిగారు. జెంగ్జూ ప్రాంతంలో యాపిల్ తయారీ ఫ్యాక్టరీలో కూడా పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు . దాంతో చాలా మంది ఇంటి ముఖం చూడక చాలా రోజులైంది. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మానసిక, శారీరిక ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించారు. అనంతరం బయటకొచ్చి నిరసనకు దిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Covid cases