CHINA BUILDS A TEMPORARY HOSPITAL WITH 6000 BEDS AMIDST RISING COVID 19 CASES PVN
Covid In China : చైనాలో కరోనా విజృంభణ..6వేల బెడ్స్ తో తాత్కాలిక హాస్పిటల్
చైనాలో కోవిడ్ విజృంభణ
Covid Cases Rising In China : చైనాకు ప్రస్తుతం స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. ఒమిక్రాన్ ను మించిన వేగంతో విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ ధాటికి రికార్డు స్థాయిలో చైనాలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా పలు నగరాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
Temporary Covid Hospital In China : చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జీరో కొవిడ్ విధానంతో కఠిన లాక్డౌన్ లు విధించి కరోనాను అదుపులోకి తెచ్చిన చైనాకు ప్రస్తుతం స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. భారత్ లో కోవిడ్ మూడో వేవ్ కు కారణమైన ఒమిక్రాన్ వైరస్ కంటే స్టెల్త్ ఒమిక్రాన్ రకం వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని షాంఘై ఫుడాన్ విశ్వవిద్యాలయం వ్యాధి నిపుణుడు ఝాంగ్ వెన్ హాంగ్ తెలిపారు. ఏ ఇతర వేరియంట్ లతో పోల్చినా స్టెల్త్ ఒమిక్రాన్ వ్యాప్తి వేగం ఎక్కువని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ ను మించిన వేగంతో విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ ధాటికి రికార్డు స్థాయిలో చైనాలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా పలు నగరాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పెద్ద నగరాలైన జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్, హంకాంగ్ తో సరిహద్దు నగరంషెన్ జెన్ సహా పలు నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది జిన్ పింగ్ ప్రభుత్వం.
కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 6000 బెడ్స్‌తో తాత్కాలిక హాస్పిటల్ నిర్మాణాన్ని చైనా ప్రభుత్వం ప్రారంభించింది. చైనాలోని జిలిన్ సిటీలో హాస్పిటల్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. కేవలం 6 రోజుల్లోనే 6000 బెడ్స్‌తో ఈ హాస్పిటల్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం అయింది. హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. జిలిన్ ప్రావిన్స్‌లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా సోమవారం 1337 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.
LIVE: A makeshift hospital is under construction in Jilin City in China's Jilin Province to cope with a resurgence of COVID-19. The facility, which will provide 6,000 beds, is expected to be completed within 6 days https://t.co/JJRuqZzzZO
చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్ వ్యూహం తమకు తీవ్ర భారంగా మారుతున్నట్లు అక్కడి సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య, ఉత్పత్తి కేంద్రాలపైనా లాక్ డౌన్ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ చైనాలోని టెక్ హబ్ గా పిలువబడే షెన్ జెన్ లో లాక్ డౌన్ కారణంగా ఐఫోన్ తయారీ కీలక కేంద్రం కార్యకలాపాలు నిలిపివేసింది. ఫాక్స్‌కాన్, హువావే, టెన్సెంట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హువావే, టెన్ సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్ జెన్ లోనే ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.