చైనాలో మనుషులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్...త్వరలోనే విరుగుడు సిద్ధం...

చైనాకు చెందిన సినోవక్ అనే ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ డోస్‌ల ప్రయోగానికి వాలంటీర్లను సిద్ధం చేసుకుంది. జూన్ లోగా సురక్షితమైన, పూర్తి సామర్థ్యంతో క్లినికల్ ట్రయల్స్ చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.

news18-telugu
Updated: April 18, 2020, 11:16 AM IST
చైనాలో మనుషులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్...త్వరలోనే విరుగుడు సిద్ధం...
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది. చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు సాధిస్తుండటంతో.. సాధ్యమైనంత తొందరగా కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు అందరిలోనూ కనిపిస్తున్నాయి.
  • Share this:
చైనాలో కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు పడింది. చైనా ఇప్పుడు ఆ వ్యాధి చికిత్సకోసం వ్యాక్సిన్‌ను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. చైనాలో కొన్ని కంపెనీలు యుద్ధ ప్రాతిపదికపై పనిచేస్తూ క్లినికల్ ట్రయల్స్‌కు రెడీ అవుతున్నాయి. చైనాకు చెందిన సినోవక్ అనే ఫార్మా కంపెనీ వ్యాక్సి న్ డోస్‌ల ప్రయోగానికి వాలంటీర్లను సిద్ధం చేసుకుంది. జూన్ లోగా సురక్షితమైన, పూర్తి సామర్థ్యంతో క్లినికల్ ట్రయల్స్ చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. వివిధ కంపెనీలు తయారు చేసే వ్యాక్సిన్‌లలో ఏది సత్ఫలితాన్ని ఇస్తుందో నిర్ధారణ అయిన తర్వాత…భారీ ఎత్తున దాన్ని ఉత్పత్తి చేసేందుకు చైనా ప్రభుత్వం సదరు కంపెనీకి ఇప్పటికే భూమి కూడా కేటాయించింది. మనుషులపై ప్రయోగాత్మకంగా ఈ వ్యాక్సిన్ పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతించే ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కరోనాపై వ్యాక్సిన్ తయారవుతుందని పేర్కొంది.
Published by: Krishna Adithya
First published: April 18, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading