తిరుమలలో వున్న పద్ధతులే ... చిలుకూరులో అమలుచేస్తాం

వంశపారంపర్య హక్కులు కల్పించిన సి.యం జగన్ కు కృతజ్ణతలు తెలియజేసారు..

news18-telugu
Updated: June 17, 2020, 2:09 PM IST
తిరుమలలో వున్న పద్ధతులే ... చిలుకూరులో అమలుచేస్తాం
తిరుమలలో వున్న పద్ధతులే ... చిలుకూరులో అవలంబిస్తాం..
  • Share this:
తిరుమల:  శ్రీవారి ఆలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని దర్శనాలు కల్పిస్తున్నారో ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చినట్లు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీ.ఎస్.రంగరాజన్ తెలిపారు..ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో ఆయన పాల్గోన్నారు..అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలాజీ టెంపులో కూడా ఇలాంటి పద్దతులు అవలంభించే ఆలోచనలో ఉన్నాంమని, వంశపారంపర్య హక్కు అనేది ఒక్క అర్చకులకే కాదు, ఎన్నో కుల వృత్తుల వారు తరతరాలుగా స్వామి వారి సేవలో ఉన్నారన్నారు..కుల వృత్తుల ప్రభావం తెలియకుండా 1987లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన గుర్తు చేసారు..ఏ.పి అసెంబ్లిలో సన్నిధి గొల్లల వంశపారంపర్య హక్కులు కల్పించిన సి.యం జగన్ కు కృతజ్ణతలు తెలియజేసారు.. అన్నమయ్య వంశస్తులు, నాయీ బ్రాహ్మణులకు త్వరలో వంశపారంపర్య హక్కులు కల్పిస్తారని ఆశిస్తున్నాట్లు తెలిపారు..లిక్విడ్ ఓజోన్ శానిటైజేషన్ ను చిలుకూరులో ఇంస్టాల్ చేశాంమని, కరోనాతో కలిసి సంసారం చేయాలి కాబట్డి ఇది రక్షగా ఉంటుందన్నారు.. ప్రతి సారీ సానిటైజ్ చేయడం కుదరదు, దీన్ని పీల్చుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు..భక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా మిగతా ఆలయాలలో వీటిని ఉపయోగిస్తే బాగుంటుందని ఆయన తెలిపారు..
Published by: Venu Gopal
First published: June 17, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading