Andhra Pradesh: ఏపీలో వ్యాక్సిన్ కోసం సీఎం జగన్ కొత్త ప్లాన్.. కేంద్రం ఒప్పుకుంటుందా..?

ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) పై సీఎం జగన్ (AP CM YS Jagan) కొత్త ఆలోచనల చేశారు. కేంద్రం నుంచి సకాలంలో టీకాలు రాకపోవడంతో వ్యూహం మార్చేందుకు సిద్ధమయ్యారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కట్టడికి ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 104 వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని.., ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న సీఎం.. దీనిని అధికారులు సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలని జగన్ సూచించారు. వ్యాక్సినేషన్‌ అనేది అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని.., రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోందన్నారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది, అది కూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసుకోవాలన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని జగన్ అభిప్రాయపడ్డారు.

    అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతుందన్నారు. ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయన్నారు. అలాగే వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇక వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదన్న సీఎం.. వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు స్పష్టంగా చెప్పాలన్నారు. 45 ఏళ్లకు పైబడి మొదటి డోస్‌ తీసుకుని, రెండో డోస్‌కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలని తెలిపారు.

    ఇది చదవండి: ఏపీలో త్వరలో లాక్ డౌన్..? కరోనా కట్టడికి కఠిన నిర్ణయం తప్పదా..?


    రాష్ట్రానికి కొవీషీల్డ్‌ డోస్‌లు మొత్తం 60,60,400 రాగా, తొలి డోస్‌ కింద 43,99,802, రెండో డోస్‌ కింద 16,87,315 ఇచ్చామని, ఆ విధంగా మొత్తం 60,87,117 డోస్‌లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా కొవాక్సిన్‌ డోస్‌లు మొత్తం 12,89,560 రాగా. వాటిలో తొలి డోస్‌ కింద 9,23,296 వ్యాక్సిన్లు, రెండో డోస్‌ కింద 2,90,047 వ్యాక్సీన్లు.. మొత్తం 12,13,343 కోవాక్సిన్‌ డోస్‌లు ఇచ్చామని అధికారులు చెప్పారు. ఆ మేరకు కోవీషీల్డ్, కొవాక్సిన్‌ రెండూ కలిపి మొత్తం 73,49,960 డోస్‌లు రాగా, తొలి డోస్‌ కింద 53,23,098 వ్యాక్సిన్లు, రెండో డోస్‌ కింద 19,77,362 వ్యాక్సిన్లు.. రెండూ కలిపి ఇప్పటి వరకు మొత్తం 73,00,460 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వారు వివరించారు.

    ఇది చదవండి: కరోనా చికిత్సకు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా..? అయితే ఇవి తప్పనిసరి.. లేదంటే నో పర్మిషన్..


    ఇక 45 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 1,33,07,889 మంది నమోదు చేసుకోగా వారిలో తొలి డోస్‌ను 41,08,917 మందికి, రెండో డోస్‌ను 13,35,744 మందికి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ నెలలో తొలి 15 రోజులకు సంబంధించి కోవిషీల్డ్, కొవాక్సిన్‌ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం, ఇప్పటి వరకు 7,65,360 వాక్సిన్‌ డోస్‌లు ఇచ్చిందని, ఇంకా 1,52,490 డోస్‌లు రావాల్సి ఉందని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కింద కేంద్ర నిర్ణయించిన ప్రకారం 16,85,630 వ్యాక్సీన్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 4,93,930 మాత్రమే ఇచ్చారని, ఇంకా 11,91,700 వ్యాక్సీన్లు రావాల్సి ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు.

    ఇది చదవండి: సీఎం జగన్ మిస్సింగ్.. వెతికిపెట్టాలంటున్న లోకేష్, నిజమేనన్న RRR


    రాష్ట్రంలో ప్రస్తుతం 638 కోవిడ్‌ ఆçస్పత్రుల్లో మొత్తం 47,644 బెడ్లు ఉండగా, వాటిలో 39,271 బెడ్లు ఆక్యుపైడ్‌ అని అధికారులు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మరో 15 వేల మంది ఉన్నారని తెలిపారు. ఇక ఐసీయూలో 6789 బెడ్లు ఉండగా, 6317 ఆక్యుపైడ్‌ అని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రి అన్నది లేదని, అన్నీ ఎంప్యానెల్‌ లేదా తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రులు అని సమీక్షలో అధికారులు చెప్పారు.102 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా, వాటిలో 15,107 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, హోం ఐసొలేషన్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని వారు వివరించారు.

    ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published: