కరోనా టైంలో కూడా చికెన్ ధర పై పైకి..

ప్రతీకాత్మక చిత్రం

చికెన్ ద్వారా కరోనా వస్తుందనేది పుకార్లేనని నమ్మిన జనాలు ఇప్పుడు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు..

 • Share this:
  క‌రోనా వైరస్ కార‌ణంగా పౌల్ట్రీ రంగం తీవ్ర‌న‌ష్టల్లో కురుకుపోయింది.. చికేన్ తింటే క‌రోనా వ‌స్తుంద‌ని జ‌నాలు చికేన్ తీన‌డం మానేసారు.. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు కొంద‌రు స‌గం ధ‌ర‌కు, ఇంకోంద‌రు ఉచితంగా కోళ్ల‌ను పంపిని చేసి పెట్టిన పెట్టుబ‌డిని సైతం న‌ష్టపోయారు.. తాజాగా చికేన్ తింటే క‌రోనా రాద‌ని తేల‌డంతో జ‌నాలు చికేన్ సెంట‌ర్ల ముందు క్యూ క‌డుతున్నారు..
  నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో పౌల్ట్రీ రంగం ఒడిదుడుకుల మ‌ద్య ఊగిస‌లాడుతుంది.. గ‌త మార్చి నెల‌లో క‌రోనా ప్ర‌భావంతో పౌల్ట్రీ రైతులు న‌ష్టాల‌ను చ‌విచూసారు.. జనాల ఎవరూ కూడా చికెన్ సెంటర్లకు రాలేదు.. చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి.. కొందరు పౌల్ట్రీ వ్యాపారులు కోళ్లను ఫ్రీగా అడవిలో వదిలేశారు.. మరికొందరు ప్రజలకు పంపిణీ చేశారు.. మరికొందరు కిలో యాభై రూపాయలకు అమ్ముకున్నారు.. కొంద‌రు పూర్తిగా వారు పెట్టిన పెట్టురాకపోగా.. వారి శ్రామ‌కూడా వృద అయింద‌ని వాపోయారు.. తాజాగా ప‌రిస్థితి బిన్నంగా ఉంది.. చికెన్ ద్వారా కరోనా వస్తుందనేది పుకార్లేనని నమ్మిన జనాలు ఇప్పుడు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు.. ఈ రోజు అదే చికెన్ కిలో రెండు వందలు పలుకుతోంది.. చికెన్ సెంటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు... దీంతో పౌల్ట్రీ వ్యాపారులు తొందరపడి ఒక నెల రోజులు ఆగితే మంచి లాభాలు గడించే వారిమని విచారం వ్యక్తం చేస్తున్నారు.. ఆప్పుడు క‌రోనాతో.. ఇప్పుడు ఎండ‌ల‌తో పౌల్ట్రీ వ్యాపంరం న‌ష్టాల్లో కురుకుపోయింది.. అయితే చికెన్ సెంటర్ వ్యాపారులు మాత్రం పెద్దగా నష్టపోలేదు.. కానీ పౌల్ట్రీ వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టాన్ని చవిచూశారు.. కిలోకు రెండు వందలు పలికిన మాకు ఎలాంటి లాభం లేదని మా వద్ద నుంచి వంద రూపాయలకు కిలో చికెన్ తీసుకెళ్తున్నారని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు... ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ సహాయం అందించి పౌల్ట్రీ రంగాన్ని కాపాడాలని కోరుతుంది...
  మ‌ట‌న్ ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో చికేన్ తిందామంటే చికేన్ ధ‌ర 250 ద‌ట‌డంతో చికేన్ కూడా కొనలేక పోతున్నామ‌ని వినియోగా దారుడు రాజ‌న్న చెబుతున్నాడు..
  పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, ప్రతినిది..
  Published by:Venu Gopal
  First published: